Adivi Sesh Major.. అడివి శేష్.! విలక్షణ నటుడే కాదు, మల్టీ టాలెంటెడ్ కూడా. అతనికున్న టాలెంట్‌కి స్టార్‌డమ్ ఏనాడో వచ్చెయ్యాలి. కానీ, ఆయన స్టామినాకి తగ్గ స్టార్‌డమ్ అయితే ఇంకా రాలేదు, ఎప్పుడొస్తుందో తెలీదు.!
త్వరలో ‘మేజర్’ (Major Film) సినిమాతో పలకరించబోతున్నాడీ విలక్షణ నటుడు. నటుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపు ఆయన సొంతం చేసుకున్నాడు కూడా.
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ ‘మేజర్’ (Major Movie) సినిమా తెరకెక్కతోన్న సంగతి తెలిసిందే.
‘మేజర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, అడివి శేష్ మీడియా ముందుకొచ్చాడు. పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ.. వివిధ సినీ పరిశ్రమలపై తన అభిప్రాయాల్నీ కుండబద్దలుగట్టేశాడు అడివి శేష్.
Adivi Sesh Major.. సన్నీలియోన్‌కి ఏంటీ లింకు.?
‘అసలు నా పేరేంటో తెలుసా.?’ అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచిన అడివి శేష్ (Adivi Sesh), తన అసలు పేరుని సన్నీ కృష్ణగా ప్రకటించాడు. మరి, ఆ పేరెందుకు కొనసాగించలేదు.? అంటే, ‘సన్నీలియోన్’ కారణంగానే.! అన్నాడు.
‘సన్నీలియోన్ (Sunny Leone) కారణంగా, ఆమెకున్న ప్రత్యేకమైన గుర్తింపు కారణంగా (పెద్దల సినిమాల్లో నటించింది కదా..) నన్ను అంతా ఎగతాళి చేసేవారు.. అందుకే పేరు మార్చేసకున్నా,..’ అని సెలవిచ్చాడు అడివి శేష్.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్.. ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (అంతా ఆయన్ని సన్నీ.. అంటారు).. ఇలా వీళ్ళెవరూ, సన్నీలియోన్ గురించి బహుశా విని వుండరేమో.!
లేకపోతే, ఈ వయసులో కూడా వాళ్ళు తమ పేర్లను మార్చేసుకునవారేమో.!
సన్నీలియోన్ ఏమంటుందో మరి.!
ఇంతకీ, అడవి శేష్ చెప్పిన ‘సన్నీలియోన్ కారణంగా తన పేరు మార్పు’ వ్యవహారం, ఆ సన్నీలియోన్ (Sunny Leone) వరకూ వెళుతుందా.?
సన్నీలియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తోంది కాబట్టి, ఎవరో ఒకరు అడివి శేష్ పేరు మార్పు వ్యవహారాన్ని ఆమె దృష్టికీ తీసుకెళతార్లెండి.!
Also Read: Kangana Ranaut.. ‘రచ్చ’బండపై చెలరేగిపోతుందంతే.!
పబ్లిసిటీ స్టంటే చేశాడో.. నిజమే చెప్పాడోగానీ, సన్నీలియోన్.. సన్నీ కృష్ణ.. వ్యవహారం అడివి శేష్ ఇమేజ్ పెంచలేదు సరికదా, అతని ఇమేజ్ అయితే డ్యామేజీ అయిపోయిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.