Aishwarya Lekshmi.. ఆమె అందాల ఐశ్వర్యం.! నటిగా తానేంటో ఇప్పటికే పలు సినిమాలతో నిరూపించుకుంది. కానీ, ఆమె కూడా ఒకప్పుడు ‘లైంగిక వేధింపుల’ బారిన పడింది.
చిన్నపుడు తాను ఓ దేవాలయానికి వెళితే, అక్కడి సిబ్బంది తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆనాటి లైంగిక వేధింపుల ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది నటి ఐశ్వర్య లక్ష్మి.
Aishwarya Lekshmi ఆ రంగు చూస్తే ఇప్పటికీ భయమే..
పసుపు రంగు చూస్తే తనకు భయమనీ, చిన్నప్పుడు పసుపు రంగు దుస్తులు వేసుకుని, దేవాలయానికి వెళితే అక్కడ ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
అందుకే, అప్పటినుంచి పసుపు రంగు దుస్తులంటేనే తాను భయపడతానని ఐశ్వర్య వాపోయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
అప్పుడూ.. ఇప్పుడూ.. వేధింపుల పర్వమే..
‘నటిని అయ్యాక కూడా వేధింపులు తప్పడంలేదు.. కొందరు అసభ్యకరంగా తాకాలని చూస్తుంటారు.. బహుశా దాన్ని ఒక మానసిక రుగ్మతగా భావించాలేమో..’ అని ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గార్గి’ సినిమాలోని పరిస్థితులు తన జీవితంలో ఎదురైన సమస్య.. దాదాపు ఒకటేనని వివరించింది. ఆ చిత్రానికి ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Also Read: తమన్నా తకధిమితోం.! ఏమంత వయసైపోయిందని.?
ధైర్యమే అన్ని సమస్యల్నీ అధిగమించేలా చేస్తుందనీ, లైంగిక వేధింపులు ఎదురైతే.. భయపడకుండా ఆ విషయాన్ని అందరికీ చెప్పాలని ఐశ్వర్య సూచిస్తోంది అమ్మాయిలకి.
అమ్మాయిలే కాదు, ఒక్కోసారి అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులకు బాధితులుగా మారిపోతున్నారన్నది ఐశ్వర్య వాదన. అందులోనూ నిజం లేకపోలేదు.

అందుకే, ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదనీ, లైంగిక వేధింపులకు సంబంధించి పిల్లల్లో అవగాహన పెంచాలనీ, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేయాల్సి వుందని ఐశ్వర్య అభిప్రాయపడింది.
ఐశ్వర్య లక్ష్మి ‘అమ్మ’ అనే విభిన్నమైన సినిమాలోనూ నటించింది. ‘పొన్నియిన్ సెల్వన్’ తదితర సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది ఐశ్వర్య లక్ష్మి.