Aishwarya Rai Aaradhya లోకులు కాకులు.. కాదు, నెటిజనులూ కాకులే. సెలబ్రిటీలేమో తమకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
అందులో కొన్ని మంచి విషయాలూ వుంటాయ్. కొన్ని చెడు విషయాలూ వుంటాయ్. అలాగే పర్సనల్స్ వుంటాయ్, ప్రొఫిషనల్ అప్‌డేట్స్ కూడా వుంటాయ్.
మంచిని మంచిగానే ప్రమోట్ చేస్తుంటారు ప్రియమైన నెటిజనం. ఒకవేళ చెడు అయ్యిందా.? ఇక అంతే ఎన్ని యాంగిల్స్‌లో దాన్ని ట్రోల్ చేయాలో నెటిజనానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీయదేమో.
తల్లి, కూతురికి ముద్దు పెట్టకూడదా.?
ఇప్పుడీ ముచ్చట ఎందుకంటారా.? విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ తాజాగా నెటిజనానికి టార్గెట్ అయ్యింది. తన ముద్దుల తనయ ఆరాధ్య బర్త్‌డే సందర్భంగా ఐశ్వర్యా రాయ్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోనే ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ కొంప ముంచేసింది. అమ్మ ప్రేమకి అంతే లేదు. అమ్మ ప్రేమని అమితంగా తెలియజేసే ఫోటో అది. ఇంతకీ ఏముందా ఫోటోలో.? ఆరాధ్యను ఐశ్వర్యా రాయ్ ముద్దాడుతున్న ఫోటో అది.

ఓసోస్.! ఇందులో తప్పేముంది.? తల్లి కూతురిని ముద్దాడడంలో కూడా తప్పులు వెతుకుతారా.? అనుకోవచ్చు.
ఆరాధ్యకు ఐశ్వర్య లిప్ కిస్ ఇస్తోంది ఆ ఫోటోలో. అయితేనేం, అందులోనూ ట్రోల్ చేసేంత తప్పేమీ లేదే..! ఇది కొందరి నెటిజన్ల అభిప్రాయం.
Aishwarya Rai Aaradhya పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసిందా.?
కానీ, సోషల్ మీడియా ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.? చెప్పండి. తప్పులు వెతికడమే తమ పనిగా కొందరు కాచుక్కూచుంటారు.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. అన్నట్లుగా అలా వెతికిన తప్పుల్ని ప్రచారం రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు.
Also Read: ప్రాణాంతకమా.! ఫైటర్ సమంత ప్రచారాస్త్రమా.?
స్టార్ హీరోయిన్‌గా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఐశ్వర్యా రాయ్‌కి ఆ విషయం తెలియదా.? ఎందుకిలాంటి ఫోటో పోస్ట్ చేసింది.? బహుశా ఐశ్వర్యా రాయ్ కూడా పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.? అంటూ నెట్టింట దుష్ర్ఫచారం మొదలైంది.
అసలు ఐశ్వర్యకు పబ్లిసిటీ స్టంట్స్ చేయాల్సిన అవసరమేముంది.? క్యాజువల్‌గానే ఈ ఫోటో పోస్ట్ చేసి వుండొచ్చు. కానీ, నెటిజనానికి అది మరో విధంగా కన్‌వే అయ్యింది. ఏం చేస్తాం.!