Akhanda2 Loss Thaandavam బ్రేక్ ఈవెన్ ఈవెన్ ఫిగర్ 125 కోట్లు.. అని ట్రేడ్ పండితులు ‘అఖండ-2’ సినిమా రిలీజ్‌కి ముందు అంచనా వేశారు.
‘అబ్బే, సినిమా లెక్కలు మాకు తప్ప ఎవరికీ తెలియవు’ అని, ‘అఖండ-2’ నిర్మాతలు ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు.
నిజానికి, ట్రేడ్ పండితులకు లెక్కల లీకులు అందేదే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి.! సినిమా అనేది ఓ మాయా ప్రపంచం.
అసలు లెక్కలు నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్లకీ, ఎగ్జిబిటర్లకి మాత్రమే తెలుస్తాయ్. వాటికి అదనంగా కొంత జత చేయడమో, లేదంటే కొంత తీసివేతలు చేయడమో.. జరిగి, మీడియాకి కొన్ని లీకులందుతాయి.
ఇది అన్ని సినిమాలకూ జరిగేదే. కానీ, ట్రాకర్స్ అంచనాలు వేరే వుంటాయి. కూడికలు, తీసివేతలు, మ్యాజిక్కులు.. అన్నీ పరిగణనలోకి తీసుకుని, ఓ లెక్కని ప్రచారంలోకి తెస్తారు.
ఇంతకీ, ‘అఖండ-2’ పరిస్థితి ఏంటి.? బ్రేక్ ఈవెన్ ఫిగర్ ఎంత.? ఇప్పటికి (అంటే, నాలుగు రోజులకి) వచ్చింది ఎంత.? రావాల్సిందెంత.?
ముందే చెప్పుకున్నట్లు, 125 కోట్లు బ్రేక్ ఈవెన్ ఫిగర్.. అన్నది ప్రముఖంగా వినిపిస్తున్నమాట. అయితే, అది డిసెంబర్ 4న ప్రీమియర్ పడి వుంటే.
వారం తేడా వచ్చింది గనుక, లెక్కల్లో చాలా మార్పులొచ్చాయి. బ్రేక్ ఈవెన్ ఫిగర్లూ మారిపోయాయ్. తాజా అంచనాల ప్రకారం, బ్రేక్ ఈవెన్ ఫిగర్ 95 కోట్లు మాత్రమేనట. ఈ మ్యాజిక్ ఎవరికీ అర్థం కావట్లేదు.
మరి, నాలుగు రోజుల్లో వచ్చిన వసూళ్ళు ఎంత.? గ్రాస్ అయినా వంద కోట్లు దాటిందా.? షేర్ కనీసం 50 కోట్లు టచ్ చేసిందా.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
ఈ లెక్కల సంగతి పక్కన పెడితే, ఏరియాల వారీగా చూసుకుంటే.. అన్ని చోట్లా భారీ నష్టాలేనన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. కొన్ని చోట్ల 75 శాతం నష్టాలు, కొన్ని చోట్ల కనీసం 50 శాతం నష్టాలని అంటున్నారు.
ఇవన్నీ నిజమేనా.? అంటే, ఏమో.. నిర్మాతలకే తెలియాలి. వెబ్ మీడియాలో మాత్రం, నష్టాల తీవ్రత గురించి భయంకరమైన కథనాలే దర్శనమిస్తున్నాయి.
