Akhil Agent Trailer Review.. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది.
దీన్నొక స్పై థ్రిల్లర్‌గా చెబుతున్నారు. ‘స్పై’ పాత్రలో అఖిల్ (Akkineni Akhil) ఒదిగిపోయాడా.? అన్నది సినిమా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది.
Akhil Agent Trailer Review ఇదేం ట్రైలర్.?
చాన్నాళ్ళ క్రితం ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమో వదిలారు. అది టాప్ క్లాస్. కానీ, ఈసారెందుకో ట్రైలర్ విషయంలో ఆ స్థాయి ‘పవర్’ కనిపించలేదు.
అప్పటికీ ఇప్పటికీ ఈక్వేషన్స్ చాలా మారాయ్. అప్పట్లో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో వుండేవి. ఇప్పుడు వ్యవహారం చప్పబడింది.. కారణం, సినిమా విడుదల వాయిదా పడటమేనేమో.!
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో దిట్ట సురేందర్ రెడ్డి. ట్రైలర్‌లో ఆయన మార్క్ మిస్సయ్యింది. కానీ, సినిమాలో ఆ మ్యాజిక్‌ని ఆశించొచ్చేమో.!
Also Read: Kriti Sanon Impossible Lovestory: అసాధ్యమైన ప్రేమకథ.!
ట్రైలర్ (Agent Trailer) వరకూ అయితే కొత్తదనం ఏమీ కనిపించలేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
అఖిల్ (Akkineni Akhil) మేకోవర్‌ని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. ఈ సినిమా కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చాలా తేలిగ్గా చేసేశాడు. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా.
డాన్సుల్లో అఖిల్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? డైలాగ్ డెలివరీ విషయంలోనే అఖిల్ ఇంకా వర్క్ చేయాలేమో.! ట్రైలర్‌కి సంబంధించి కొన్ని షాట్స్‌లో అయితే అభిమానుల్ని అలరించేలా వున్నాడు అఖిల్.
సీనియర్ నటుడు మమ్మట్టి వాయిస్ (ఒరిజినల్ వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పించారెందుకో.) విషయంలో కొంత నిరాశ తప్పదు అభిమానులకి.!
ఏమో, థియేటర్లో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయడం కోసం.. ట్రైలర్‌లో ‘పవర్ డోసు’ కొంచెం తగ్గించారేమో.! ‘ఏజెంట్’ ట్రైలర్ చూస్తే అలాగే అనిపించింది చాలామందికి.