అఖిల్ సార్ధక్, మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కాస్తంత ఆశ్చర్యకరమైన కంటెస్టెంట్స్‌గా చెప్పుకోవాలేమో.! ఇద్దరికీ ఓ విషయంలో పోలికలున్నాయి. అదే, ‘ఏడుపు’. కొంతమందికి ఏడుపు ఓ బీభత్సమైన ఎమోషన్ అవుతోంది బిగ్‌బాస్‌కి (Akhil Sarthak Vs Monal Gajjar) సంబంధించినంతవరకు.
కానీ, అన్ని వేళలా ఈ ఏడుపు వర్కవుట్ కాదు. మోనాల్ ఏడుస్తుంది, అఖిల్ ఓదార్చుతాడు. అఖిల్ ఏడుస్తాడు.. సోహెల్ ఓదార్చుతాడు. మోనాల్‌ని కూడా సోహెల్ ఓదార్చుతాడు. మోనాల్‌ని ఓదార్చేవారి లిస్ట్ పెద్దదే.. అందులో హారికకి కూడా ప్లేస్ వుంటుంది.
అఖిల్ విషయంలోనూ అంతే. ఎమోషన్స్ ఎవరికైనా కామన్. కొందరు, ఆ ఎమోషన్‌ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే అసలు సమస్య. మోనాల్ గజ్జర్ కంటతడి పెట్టినా, అఖిల్ కంటతడి పెట్టినా.. అందులో చాలామందికి ‘నటన’ కన్పిస్తోంది. బిగ్‌బాస్ వ్యూయర్స్ దృష్టిలో మెజార్టీ చెప్పేది ఇదే.
మోనాల్, అఖిల్‌ని నామినేట్ చేస్తే ఇంకేమన్నా వుందా.? అఖిల్, మోనాల్‌ని నామినేట్ చేస్తే.. మోనాల్ కొంతవరకు సరిపెట్టుకుంటుంది. అఖిల్ అలా కాదు. అడ్డగోలుగా వాదిస్తాడు. నిజానికి, ఎవరు తనను నామినేట్ చేసినా అఖిల్ ఒప్పుకోడు. అవతలి వ్యక్తిని మాట్లాడనివ్వడు.
తొలి వారం నుంచి, ఇప్పటిదాకా అఖిల్ బిగ్‌హౌస్‌లో చేస్తున్న యాగీ ఇదే. బిగ్‌బాస్ ఓటింగ్‌కి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘అంతా జెన్యూన్..’ అని చెబుతుంటారు నిర్వాహకులు. నిజమేంటో ఆ పైవాడికే ఎరుక. అఖిల్, మోనాల్.. ఇప్పటిదాకా పలుమార్లు నామినేట్ అయ్యారు ఎలిమినేషన్ కోసం.
నామినేట్ అయిన ప్రతివారం ఎలాగోలా సేవ్ అయిపోతున్నారు అఖిల్, మోనాల్. ఇదొక మిస్టరీ. ఆ సక్సెస్ సీక్రెట్ (Akhil Sarthak Vs Monal Gajjar) ఏంటన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. మోనాల్, నువ్వసలు ఏమీ చెయ్యట్లేదు.. అని చాలామంది హౌస్‌మేట్స్ చెబుతున్నారు. మరి, ఆమె ఎలా సేవ్ అవుతోంది.?
అఖిల్ విషయానికి వస్తే, అతనికి చాలామంది సపోర్ట్ లభిస్తోంది హౌస్‌లో. మెహబూబ్, సోహెల్, మోనాల్.. ఈ ముగ్గురూ కలిసి పలుమార్లు అఖిల్‌ని గట్టెక్కించేశారు. చిత్రమేంటంటే, అఖిల్‌తో వాదించడం ఇష్టం లేక, అబిజీత్.. ఈ వారం అఖిల్‌ని నామినేట్ చేయాల్సి వున్న చెయ్యలేకపోయాడు. అదీ అఖిల్, బిగ్‌హౌస్‌లో నామినేషన్ల సందర్భంగా చేస్తున్న రచ్చకి నిదర్శనం.
ఈ వారం అఖిల్, మోనాల్ ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.. ఈసారేమవుతుందో వేచి చూడాలి.