Akira Nandan Facing Negativity.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడా.? రాడా.? ప్రస్తుతానికైతే, చదువుకుంటున్నాడు అకీరా నందన్.!
అయితే, జూనియర్ పవర్ స్టార్.. అంటూ, అప్పుడే అభిమానులు తమ అభిమాన నటుడి కుమారుడు అకీరా నందన్‌ని ‘స్టార్’ని చేసేశారు.!
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు అఖిల్, నెలల వయసులోనే నటుడైపోయిన సంగతి తెలిసిందే. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకున్నట్టే.. యాక్టర్ కొడుకు యాక్టర్ అయితే తప్పేంటి.?
టాలెంట్‌ని తొక్కేస్తున్నారు..
టాలెంట్‌తో సంబంధం లేకుండా స్టార్ హీరో తనయుడు కాబట్టి, బెస్ట్ స్క్రిప్ట్.. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్.. బెస్ట్ డైరెక్టర్.. ఇవన్నీ అకీరా నందన్‌కి దక్కుతాయంటూ కొందరు నెటిజన్లు, అకీరా నందన్ మీద విమర్శలు చేస్తున్నారు.
Valid question, but It’s not the kids fault that they are born to film actors or directors or successful producers. Yes, first chance they get is easy but they have to do double the hard work which their parents did to keep the name of the family. We all know how mercilessly the people will insult the children of film families who are not successful like their parents. So i guess grass is always greener on the other side. Focus only on your self. Be honest with yourself and your craft and if you’re talented then no body can stop you and you can be the next Star
Renu Desai
ఈ విమర్శలపై అకీరా నందన్ (Akira Nandan) తల్లి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
అంబానీ వారసుడే, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటాడు.. వేరకొరికి, ఆ సామ్రాజ్యాన్ని అప్పగించరు కదా.? అని రేణు దేశాయ్ ఎదురు ప్రశ్నించారు.
Akira Nandan Facing Negativity.. టాలెంట్ వుంటేనే..
స్టార్ హీరో కుమారుడైనాగానీ, టాలెంట్‌ని నిరూపించుకోవాల్సిందేనంటోన్న రేణు దేశాయ్, ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ అనేది తొలి సినిమాకి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు.
తండ్రి స్టార్ హీరో గనుక, ఆయన్ని చూస్తూ పెరిగే పిల్లలు.. నటనా రంగంపై ఆసక్్తి పెంచుకోడంలో తప్పేముందని రేణు దేశాయ్ ప్రశ్నించడం గమనార్హం.

ప్రస్తుతానికి సినిమాల గురించి అకీరా నందన్ ఆలోచించడంలేదనీ, చదువు మీద ధ్యాసతో వున్నాడనీ, నటనపై ఆసక్తి చూపిస్తే, తల్లిగా అతన్ని ప్రోత్సహిస్తానని రేణు దేశాయ్ చెప్పారు.
Also Read: గుంటూరు కారమ్.! ‘ఎర్నలిస్టు’లని ఏకిపారేసిన మహేష్‌బాబు.!
మొత్తమ్మీద, అప్పుడే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మీద, ‘నెగెటివిటీ’ మొదలైపోయిందన్నమాట.!
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కలిసి పలు సినిమాల్లో నటించారు. అంతే కాదు, రేణు దేశాయ్ దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మారారు. సో, సినిమాపై మక్కువ చిన్నప్పటినుంచే అకీరా నందన్‌కి ఏర్పడటంలో వింతేముంది.?
చిరంజీవి స్టార్ హీరో.. అలాగని, నాగబాబు స్టార్ హీరో అవలేకపోయారు కదా.! వారసత్వం తప్పు కాదు.! వారసత్వంతోనే స్టార్లుగా మారిపోరు. తమదైన ప్రత్యేకత ముద్రని నటులుగా వేయగలిగితేనే, స్టార్‌డమ్ వస్తుందెవరికైనా.!