Akkineni Akhil Lenin.. బాల నటుడిగా, నెలల వయసులోనే తెరంగేట్రం చేసేసిన అక్కినేని అఖిల్, హీరోగా నిలదొక్కుకునేందుకు మాత్రం ఆపసోపాలు పడుతున్నాడు.
అక్కినేని నాగార్జున నట వారసులుగా నాగచైతన్య, అఖిల్.. తెరంగేట్రం ఎప్పుడో చేసేశారు. నాగచైతన్య ఖాతాలో కొన్ని హిట్లున్నాయ్.
అఖిల్ విషయానికొస్తే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త ఫర్లేదంతే.. కమర్షియల్ కోణంలో. అంతకు మించి, సరైన హిట్ అయితే అఖిల్‌కి ఇప్పటిదాకా లేదు.
అయితే, స్టార్ హీరో తనయుడు కదా.. పైగా, సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన అన్నపూర్ణా స్టూడియోస్.. సొంత బ్యానర్.!
Akkineni Akhil Lenin.. అయ్యగారికి అన్నీ వున్నా..
అన్నీ వున్నా.. ఎక్కడో తేడా కొట్టేస్తోంది. అదేంటన్నది అర్థం కాక, అక్కినేని అభిమానులు, అఖిల్ విషయంలో ఆందోళన చెందుతున్నమాట వాస్తవం.
డాన్సులు చాలా బాగా చేస్తాడు. అక్కినేని హీరోల్లో, నెంబర్ వన్ డాన్సర్ అఖిల్. యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికొస్తే, ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. అందగాడు కూడా.

తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా, భిన్నమైన కాన్సెప్టులు అయితే ట్రై చేశాడు, ఏదీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. తాజాగా, ‘లెనిన్’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు అఖిల్.
Also Read: లీకు.! సచ్చిపోమాకు.! ‘ఆమె’ కూడా ‘అమ్మ’లాంటిదే.!
అఖిల్ జన్మదినం సందర్భంగా ‘లెనిన్’ టీమ్, ఓ ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేసింది. మాస్ అవతార్‌లో అఖిల్ కనిపిస్తున్నాడు. హిట్టు కళ కనిపిస్తోందంటూ అభిమానులూ హ్యాపీగానే వున్నారిప్పుడు.
అన్నట్టు, అఖిల్‌ని అతని అభిమానులు ‘అయ్యగారూ’ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈసారి అయ్యగారు ఏం చేస్తారోనని.. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఆ మధ్య అఖిల్ చేసిన ‘ఏజెంట్’ దారుణమైన రిజల్ట్ చవిచూసింది. ఓటీటీలోకి రావడానికే, చాలా చాలా భయపడింది ఆ సినిమా. ఆ ఫెయిల్యూర్ నుంచి కోలుకోవడానికే అఖిల్‌కి చాలా టైమ్ పట్టింది.
ఏదిఏమైతేనేం, ‘లెనిన్’ అంటూ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ‘అయ్యగారు’ అఖిల్, ఈసారి హిట్టు కొట్టాలనే కోరుకుందాం.