Alia Bhatt Glamorous Makeover.. చక్కనమ్మ అంత చక్కగా కనిపించాలంటే ఏం చేయాలి.? అందానికి మెరుగులు దిద్దాలి.!
మెరుగులు దిద్దడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు మరి.! దిద్దాలి, రుద్దాలి.. నఖ శిఖ పర్యంతం.. అంటాం కదా.! అలా దిద్దాలి, రుద్దాలి.! చెక్కాలి కూడా.!
చూస్తున్నారు కదా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ని ఎలా డిజైన్ చేస్తున్నారో.! సహజ సౌందర్యానికి మించి, మేకప్ పౌందర్యంతో.. అందాన్ని రెట్టింపు చేసుకోవాల్సిందే మరి.!
జుట్టుకి ఒకరు, చెంపలకి ఇంకొకరు.. పెదాలకీ కావాలొకరు. స్కిన్ టోన్ సరిగ్గా వుందో లేదో చూసుకోవడానికి మరొకరు. కాస్ట్యూమ్స్ కోసం ఇంకొకరు.! అంతేనా, కథ ఇంకా పెద్దదే వుంది.
ధరించే డ్రెస్సు.. ఫొటోలకు అందంగా కనిపించాలంటే, మళ్ళీ అదో పెద్ద కథ.!
Alia Bhatt Glamorous Makeover.. రెడ్ కార్పెట్ మీద అదరగొట్టేయాలంటే..
రెడ్ కార్పెట్ మీద హొయలొలికించే క్రమంలో పొడుగాటి గౌనుల్ని ధరిస్తే, వాటిని అక్కడ అందంగా పేర్చడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది సిబ్బంది.
కేవలం అందాల భామలకే పరిమితమైన వ్యవహారం కాదిప్పుడు ఈ దిద్దుడు.. చెక్కుడు.! వివాహాది శుభ కార్యాల్లోనూ, స్టైలిష్టుల సందడి ఎక్కువైపోయింది. ఆ రకంగా ఉపాధి మార్గాల్ని వెతుక్కుంటోంది నేటి యువత.
Also Read: నాకింకా పెళ్ళి కాలేదు.! ఆ వేధింపులు ఆపండి.!
ఇంతకీ, సహజ సౌందర్యం గొప్పదా.? ఈ చెక్కుడు అందం గొప్పదా.? అంటే, దేనికదే.. ప్రత్యేకం అని చెప్పుకోవాలేమో.!
అబ్బే, సహజ సౌందర్యమే గొప్పదని ఎవరన్నా అంటే, కోపమొచ్చేస్తుంటుంది అందాల భామలకి.! ఎందుకంటే, కొందరికి మేకప్పు లేకపోతే, తమ లుక్కు తమకే నచ్చని పరిస్థితులున్నాయ్.
అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ‘బ్యూటీ’ చుట్టూ, విపరీతమైన వ్యాపారం జరుగుతోంది. బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మకాలు ఏ ఏడాదికాయేడాది సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి.
ఔను, ఇది నిజంగానే అందమైన వ్యాపారం.!
