Allu Arjun Atlee Remuneration.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పండ్రా ఎవడైనా.! మీరు గనక చెప్పకపోతే, బుర్రలు బద్దలైపోతాయ్.. ఆ తర్వాత మీ ఖర్మ.!
ఏంటిదంతా.? అసలు రెమ్యునరేషన్ అనేది ఇచ్చినోడికి, తీసుకున్నోడికి మాత్రమే సంబంధించిన విషయం కదా.! ఊళ్ళో పెళ్ళికి, ఈ గాసిప్పుల హడావిడేంటి.?
అదంతే, సెలబ్రిటీలు కదా, మీడియా అటెన్షన్ వుంటుంది. ఏ వార్తా లేనప్పుడు, ఏదో ఒక వార్త వేడిగా వండి వడ్డించాలి.! అందులో విషయం వున్నా.. లేకున్నా.!
Allu Arjun Atlee Remuneration.. అల్లు అర్జున్.. అట్లీ.. సినిమా
ఐకాన్ స్టార్‌గా మారిన ఒకప్పటి అల్లు అర్జున్ తాజా సినిమా, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈసారి పాన్ వరల్డ్ సినిమా అంట.!
ఆ విజువల్ ఎఫెక్ట్స్.. ఆ హాలీవుడ్ సాంకేతిక నిపుణులు.. ఇలా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ గురించి అప్పుడప్పుడూ ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయ్.

సినిమాని ఆ స్థాయిలో నిర్మిస్తున్నప్పుడు, ‘బజ్’ ఎప్పుడూ సినిమా మీద అలాగే వుండాలి కదా.!
అందుకే, ఇంట్రెస్టింగ్ విషయాల్ని లీక్ చేయడమో, సమాచారం అదికారికంగా అందించడమో చేస్తుంటారు. అందులో తప్పు లేదు కూడా.!
కానీ, ఈ రెమ్యునరేషన్ గోలేంటి.?
అల్లు అర్జున్ సరసన దీపిక పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకి కూడా భారీగానే రెమ్యునరేషన్ సమర్పించుకోవాలి.. తప్పదు.
ఇంతకీ, అల్లు అర్జున్ రెమ్యనరేషన్ ఎంత.? అంటే, 175 కోట్లు అని ఒకరు, 190 కోట్లు అని ఇంకొకరు, కాదు కాదు 250 కోట్లు రెమ్యునరేషన్ అని మరొకరు.. పోటా పోటీగా గాలి పోగేస్తున్నారు.
Also Read: నాగార్జున, టబు.. ఇంకోస్సారి జతకడితే ఆ కిక్కే వేరప్పా.!
హీరో అల్లు అర్జున్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నదీ నిర్మాత అధికారికంగా చెప్పే పరిస్థితి వుండదు. నిర్మాత నుంచి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నదీ హీరో కూడా అధికారికంగా చెప్పడు.
ఎవరి గోల వారిది.! ఈలోగా రాసుకున్నోడికి రాసుకున్నంత.! ఏం, రాసేసుకోరాదా.. వెయ్యి కోట్లు రెమ్యునరేషన్ అనీ.! ఏమో, ముందు ముందు ఆ దిక్కుమాలిన రాతలు కూడా చూస్తామేమో.!
