Allu Arjun Iconic Twist అల్లు అర్జున్ హీరోగా ఓ ప్రెస్టీజియస్ వెంచర్ తెరకెక్కబోతోంది. అదే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో. ఈ ప్రాజెక్ట్ ‘పాన్ ఇండియా’ స్థాయిలో వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
అయితే, కొంతమందికి కొన్ని డౌటానుమానాలొస్తున్నాయ్. అందులో ముఖ్యమైంది, అసలు సందీప్ రెడ్డి వంగా ఎప్పుడు ఖాళీ అవుతాడు అల్లు అర్జున్ సినిమా కోసం.? అన్నదే.!
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ‘స్పిరిట్’ అనే సినిమా చేయాల్సి వుంది. ఈ రెండూ పూర్తయ్యేసరికి ఎంతకాలం పడుతుందో ఏమో.!
కొరటాల శివతో సినిమా అన్నాడు.. సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటున్నాడు.!
అప్పుడు అది అటకెక్కింది.. ఇప్పుడు ఇది ఏమవుతుందో.!
ప్రాజెక్టులు చేతులు మారడం మామూలేగానీ..
Mudra369
ఇక, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ పనుల్లో బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా.
Allu Arjun Iconic Twist.. ‘పుష్ప ది రూల్’ మీద హైప్ కోసమేనా.?
వాస్తవానికి అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.

మరిప్పుడు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా సంగతేంటి.? అప్పట్లో కొరటాలతో సినిమా చేయడం కోసం కొంతకాలంగా ఎదురు చూశానని అల్లు అర్జున్ చెప్పాడు.
దాన్నే కాస్త మార్చి, సందీప్ రెడ్డి వంగాతో సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పేర్కొన్నాడు.
Also Read: సెటైర్: ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి అధ్యక్షా.?
సో, చాలామందికి చాలా రకాల డౌటానుమానాలు వస్తున్నాయ్.. అప్పట్లో కొరటాల, ఇప్పుడేమో సందీప్ రెడ్డి వంగా.. అల్లు అర్జున్ ఖాతాలో మరో భంచిక్.. అన్నది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ.
కేవలం ‘పుష్ప ది రూల్’కి హైప్ తెచ్చేందుకే సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్న వార్తల్లో నిజమెంతో మరి.!