Table of Contents
లోకేష్ కనగరాజ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తమిళ డైరెక్టరే అయినా, తెలుగు ప్రేక్షకుల (Allu Arjun)మనసుల్నీ విశేషంగా దోచేశాడీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్.
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో మనోడు పిచ్చ క్రేజ్ సంపాదించాడు. ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ కనగరాజ్ పేరు మరింత మార్మోగిపోయింది. అసలు మ్యాటరేంటంటే, మనోడి కన్ను టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై పడిందనీ తాజా సమాచారం.
అల్లు అర్జున్ కోసం ఓ కథ రెడీ చేశాడట లోకేష్ కనగరాజ్. అంతకన్నా ముందే, అల్లు అర్జున్ కోసం ఓ స్పెషల్ రోల్ సిద్ధం చేశాడట లోకేష్ కనగరాజ్.
Allu Arjun.. లోకేష్ కోసం బన్నీ
‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించాల్సి వుంది లోకేష్ కనగరాజ్. అతి త్వరలోనే వీటిలో ఏదో ఒక సినిమాకి అర్జెంటుగా సీక్వెల్ రూపొందించే పనిలో వున్నాడు లోకేష్.
ప్రస్తుతానికి ఆ అప్డేట్ అయితే లేదు కానీ బాస్. మరో ఇంట్రెస్టింగ్ గాచిప్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్‌ని తన సినిమాలో మొదట డిఫరెంట్ రోల్లో చూపించాలన్న యోచన చేస్తున్నాడట లోకేష్.

ఏముందిలెండి.! భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు హీరోలు, అన్ని భాషల్లోనూ నటించేందుకు ఇష్టపడుతున్నారు. జస్ట్ గెస్ట్ రోల్స్ కోసం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అలాగే బన్నీ కూడా. లోకేష్ సినిమాలో హీరోగా నటించేందుకు మన తెలుగు హీరోలు ఆసక్తిగా వున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో బన్నీ కూడా వున్నాడు.
Also Read: Rashmika Mandanna అల్ట్రా మోడ్రన్.! ‘అది’ గుర్తుపట్టారా.?
హీరోగా పూర్తి స్థాయి సినిమాకి ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశాలున్నాయ్. కానీ, ఈ లోపు ‘ఖైదీ 2’ లేదా, ‘విక్రమ్ 2’ సినిమా కోసం అల్లు అర్జున్‌ని సరికొత్త క్యారెక్టర్లో చూపించాలనుకుంటున్నాడట లోకేష్.
అల్లు అర్జున్ మరో రోలెక్స్ అవుతాడా.?
ఆల్రెడీ ‘విక్రమ్ 2’ కోసం రోలెక్స్‌గా సూర్య క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి రెండో పార్ట్ కోసం హింట్ వదిలి పెట్టిన లోకేష్, మరో ఇంట్రెస్టింగ్ రోల్ కోసం బన్నీతో సంప్రదింపులు చేస్తున్నాడనీ తెర వెనక సమాచారం.
కొద్ది నిముషాల నిడివి మాత్రమే వుండే ఈ పాత్ర సినిమా కథపై చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనీ అంటున్నారు. ఇంతకీ బన్నీ పాత్ర ‘ఖైదీ 2’ కోసమా.? ‘విక్రమ్ 2’ కోసమా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త క్యూరియాసిటీ
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ‘పుష్ప 2’ కోసం ఆ పాత్ర మరింత పవర్ ఫుల్‌గా రూపుదిద్దుకోబోతోందన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లోకేష్ సినిమా కోసం అల్లు అర్జున్ డిఫరెంట్ మేకోవర్ ఎలా వుండబోతోందో అంటూ బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త క్యూరియాసిటీ నెలకొంది.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ షూటింగ్‌తో బిజీగా వున్నాడు. ఇటీవలే సెట్స్ మీదికెళ్లిన ‘పుష్ప 2’ ఐదు రోజుల షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే లాంగ్ షెడ్యూల్‌కి సుకుమార్ అండ్ టీమ్ సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.