Allu Arjun అత్యుత్సాహం కొంప ముంచేసింది. ఔను, ఓ కమర్షియల్ యాడ్‌లో చాలా ఉత్సాహంగా.. ఆ మాటకొస్తే, ఇంకాస్త అత్యుత్సాహంగా నటించేసిన సినీ నటుడు అల్లు అర్జున్, అందుకుగాను ‘శ్రీముఖం’.. అదేనండీ ‘నోటీస్’ అందుకోవాల్సి వచ్చింది.
విషయంలోకి వస్తే, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సినీ నటుడు అల్లు అర్జున్‌కి నోటీసులు పంపారు. కారణమేంటో తెలుసా.? అల్లు అర్జున్ ఇటీవల నటించిన ఓ కమర్షియల్ యాడ్, ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీసేలా వుందట. ఆర్టీసీ బస్సు ఎందుకు దండగ.. బైక్ సర్వీస్ అందుబాటులో వుండగా.. అంటూ అల్లు అర్జున్ చాలా ‘సులాగ్గా’ నటించేశాడు ఆ ప్రకటనలో.

Allu Arjun ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు..
కార్లను, ఆటోల్నీ ఎక్కడికంటే అక్కడికి రప్పించేసుకుని ‘రైడ్స్’కి వెళ్ళిపోతున్నాం.. అలాగే, బైకులు కూడా.! ఈ మధ్యనే ఇవి విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ మార్గాల్లో ఇవి చాలా సౌకర్యవంతంగా వుంటున్నాయ్. దాన్ని ఇంకోరకంగా చూపించొచ్చుగానీ.. ఆర్టీసీ బస్సుల్ని కించపర్చడమేంటట.?
యాడ్ విషయంలో క్రియేటివిటీ అదిరింది. ఆ ప్రకటనలో చూపించినట్టే.. కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం నరకమే. దాన్ని సాధారణ దోశ, మసాలా దోశ.. అంటూ ప్రకటనలో అల్లు అర్జున్‌తో వెరైటీగా చెప్పించేశారు నిర్వాహకులు.
Also Read: Pushpa The Rise.. శ్రీవల్లి సోయగం నెవ్వర్ బిఫోర్.!
అసలే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్.. ఆర్టీసీకి సంబంధించి సమస్యల్ని అత్యంత వేగంగా పరిష్కరించేందుకు పలు చర్యలు చేపడుతున్నారు. చాలా తక్కువ కాలంలోనే ఆర్టీసీ పట్ల ప్రజల్లో విశ్వాసం రెట్టింపవుతోంది కూడా.
ఈ టైములో అల్లు అర్జున్ (Allu Arjun) ఇలాంటి ప్రకటనలో నటించడమేంటబ్బా.? ఏమోగానీ, సదరు సంస్థకి కూడా తెలంగాణ ఆర్టీసీ నోటీసులు వెళ్ళాయట.
