స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా, అల్లు అర్జున్ తదుపరి సినిమా ఓ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్‌తో (Allu Arjun To Join Hands With Prashanth Neel) వుండబతోందట.
ఇంతకీ, ఆ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ ఎవరు.? అంటే, ఇంకెవరు.. ‘కెజిఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్.. అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు జరిగాయనీ, ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ చెప్పిన కథకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ పనుల్లో బిజీగా వున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా చేయనున్న విషయం విదితమే. మరోపక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి వుంది.
నిజానికి, ప్రభాస్ (Prabhas) సినిమా కంటే ముందే ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. ఏమయ్యిందో, ప్రశాంత్ నీల్ – ప్రభాస్ (Prabhas Prashanth Neel Combo Salaar) కాంబో ముందుగా వర్కవుట్ అవుతోంది.
అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ (Prashanth Neel To Direct Young Tiger NTR) వెనక్కి వెళ్ళి, మధ్యలోకి అనూహ్యంగా అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబో దూసుకొస్తోందా.? అన్న విషయమై క్లారిటీ లేదు.
అధికారిక ప్రకటన వస్తే తప్ప, బన్నీ – ప్రశాంత్ నీల్ కాంబోపై ఓ క్లారిటీ రావడం కష్టమే. కానీ, ఈ ఇద్దరి కాంబో (Allu Arjun To Join Hands With Prashanth Neel) ఫైనల్ అయితే మాత్రం, రచ్చ మామూలుగా వుండదు.