Allu Sirish Engagement MegaAllu.. మెగా కాంపౌండ్ నుంచి, ‘అల్లు’ అనే బ్రాంచ్‌ని వేరు చేయాలనుకోవడం సాధ్యమా.? ఛాన్సే లేదు.!
ఔను, మెగాస్టార్ అనే మహా వృక్షం కింద మేమంతా.. చిన్న చిన్న మొక్కలం.. అని ఓ సందర్భంలో స్వయానా అల్లు అర్జున్ చెప్పాడు.
అల్లు అరవింద్ అంటే, మెగాస్టార్ చిరంజీవికి బావమరిది.! రామ్ చరణ్‌కి అల్లు అరవింద్ స్వయానా మేనమామ.! మళ్ళీ ఈ రిలేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వుందా.?
Allu Sirish Engagement MegaAllu.. అభిమానం ముసుగులో ‘ఆర్మీ’ అత్యుత్సాహం..
తప్పట్లేదు.. ఎందుకంటే, సోషల్ మీడియా వేదికగా కొందరు అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.. మెగా హీరోల మీద, అల్లు అభిమానులమని చెప్పుకుంటూ.
దానికి కౌంటర్ ఎటాక్, మెగా హీరోల అభిమానుల నుంచి రావడం సహజమే. ఎందుకంటే, అల్లు అర్జున్ అనే హీరోని, తొలుత భుజాన మోసింది మెగాభిమానులే గనుక.

సరే, ఇప్పుడా విషయాలన్నీ ఎందుకంటే.. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్‌లో మెగా హీరోలు మెరిశారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్.. ఇలా అందరూ సందడి చేశారు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో.
అల్లు శిరీష్, నయనిక.. ఎంగేజ్మెంట్‌లో ‘అల్లు’కున్న ‘మెగా’నుబంధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్, మెగా హీరోలందరితోనూ సరదాగా ముచ్చటించాడు.
Also Read: డేటింగు.! గాసిప్పింగు.!
మొన్నీమధ్యనే అల్లు అర్జున్ నానమ్మ చనిపోతే, అప్పుడూ అందరూ కలిశారు. అంతకు ముందూ కలిశారు, ఇకపైనా కలుస్తారు.. ఇందులో వింతేముంది.?
ఇక్కడితో అయినా, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంది. మెగా కాంపౌండ్ మీద దుష్ప్రచారం చేయడం మానేసుకుంటే మంచిది. అది అల్లు అర్జున్‌ని గౌరవించినట్లవుతుంది.
