Allu Sirish సోషల్ మీడియాని వదిలేస్తానంటూ పెద్ద షాకే ఇవ్వాలనుకున్నాడుగానీ, రివర్స్ ఎటాక్ ఎదురయ్యేసరికి తానే షాక్ తినేశాడు.
అసలేమయ్యిందంటే, 11 నవంబర్ 2021 (అంటే నేడే) తన కెరీర్ పరంగా చాలా ముఖ్యమైన రోజనీ, సోషల్ మీడియాని కొన్ని రోజులపాటు వదిలేస్తాననీ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. క్లియర్‌గానే కెరీర్ గురించి అల్లు శిరీష్ ప్రస్తావించినా, నెటిజన్లు అపార్థం చేసేసుకున్నారు. ‘ఏం బ్రో.. పెళ్ళి చేసుకుంటున్నావా.?’ అంటూ ప్రశ్నించారు.
Allu Sirish.. బాగా ఆడేసుకున్నారు బ్రో..

నెటిజన్ల ప్రశ్నలకు అల్లు శిరీష్ ఒకింత ఇబ్బంది పడ్డాడు. ఓ నెటిజన్ అయితే దూషణలతో ప్రశ్నించాడు అల్లు శిరీష్‌ని. ‘మరీ ఇంత దారుణమా బ్రదర్..’ అంటూ కూల్‌గానే ఆ అభిమానిని అల్లు శిరీష్ సముదాయించాల్సి వచ్చింది.
సోషల్ మీడియా అంటేనే అంత. ఏదో చెప్పాలనుకుంటే, ఇంకోటేదో అయ్యింది. కొత్త సినిమాకి ఓకే చెప్పిన అల్లు శిరీష్, ఆ సినిమా షూటింగ్ రిమోట్ ఏరియాలో జరగనున్న దరిమిలా, సోషల్ మీడియాకి దూరంగా వుండాల్సి వస్తుందట. అదీ అసలు కథ.
Also Read: Poonam Pandey.. అతడు, ఆమె.. పబ్లిసిటీ చితక్కొట్టుడు.!
అయినా, అల్లు శిరీష్ (Allu Sirish) అంత అమాయకుడేమీ కాదు. ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుందో తెలిసే, పక్కాగా ప్లాన్ చేశాడు. అల్లు శిరీష్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది, మీడియాలో అతని పేరు హాట్ టాపిక్ అయ్యింది కూడా. ఇంతకీ, అంతలా రిమోట్ ఏరియాలో షూటింగ్ చేయాల్సి వస్తుందంటే.. ఆ సినిమా కథ ఎలాంటిదై వుంటుందబ్బా.?