Table of Contents
Amarajeevi Jaladhara Pawan Kalyan.. జగనన్న కానుక.. జగనన్న గోరు ముద్ద.. జగనన్న మట్టి.. జగనన్న మశానం.. ఇవి కదా, వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలకి పెట్టుకున్న పేర్లు.!
చంద్రన్న కానుక.. చంద్రన్న అదీ.. చంద్రన్న ఇదీ.. ఇవి కదా, చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలకు పెట్టుకున్న పేర్లు.?
కూటమి ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో తనకు నచ్చిన పేర్లు, తన పేరు.. సంక్షేమ పథకాలు కొన్నిటికైనా పెట్టుకోవాలి కదా.?
రాజకీయం అంటే అదే కదా.? ప్రభుత్వం నడపడమంటే, ప్రజా ధనంతో సొంత పబ్లిసిటీ చేసుకోవడమే కదా.?
Amarajeevi Jaladhara Pawan Kalyan.. పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్..
అందరిలా కాదు.! పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్.! ప్రజల్లో మార్పు రావాలి.. పరిపాలనలో మార్పు రావాలి.. మార్పు కోసమే జన సేన పార్టీ ఆవిర్భవించింది.
ప్రజలే ప్రభుువులు ప్రజాస్వామ్యంలో.. అనే మాటని నిజం చెయ్యాలన్నది పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎజెండా.! పల్లకీ మీద కూర్చోవాల్సింది ప్రజలు.. అంటారాయన.!
సంక్షేమ పథకాలకు మహనీయుల పేర్లు పెడితే, ప్రభుత్వం మారినా.. ఆ సంక్షేమ పథకాల పేర్లు మారవు. ఆ మహనీయుల్ని ప్రజలు ఎప్పటికప్పుడు స్మరించుకునే అవకాశం వుంటుంది.
అందుకే, అమర జీవి జలధార.. అంటూ, ఓ అద్భుతమైన పేరు పెట్టారు.. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి గ్రిడ్‌కి సంబంధించిన ప్రాజెక్టుకి.
పెరవలిలో ప్రారంభించిన డిప్యూటీ సీఎం..
గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రిడ్ ప్రాజెక్టుని తాజాగా, పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్ట్ ఇది.
జెజెఎం వాటర్ గ్రిడ్ పథకానికి అమర జీవి జలధార.. అని పవన్ కళ్యాణ్ నామకరణం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దాదాపు 68 లక్షల కుటుంబాలకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా తాగు నీటిని అందిస్తారు.
మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈ జెజెఎం వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేందుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇప్పటికే, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురంలో ఇటీవల ఈ ప్రాజెక్టుకి శంఖుస్థాపన చేశారు.
మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు 7900 కోట్లు కాగా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు మూడు వేల కోట్లు వెచ్చించబోతున్నారు.
గతంలో, చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సొంత పేర్లు పెట్టుకున్నా, ప్రస్తుత కూటమి నేతృత్వంలోని చంద్రబాబు ప్రభుత్వం, సొంత ప్రచారాలకు కాస్త దూరంగా వుంటోంది.
అమరజీవికి అరుదైన నివాళి..
ఈ మార్పు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమయ్యిందన్నది నిర్వివాదాంశం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు పొట్టి శ్రీరాములు.
రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి, అమరజీవిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అలాంటి మహనీయుడిని, ‘అమర జీవి జలధార’ పథకంతో స్మరించుకునే అదృష్టం, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇలా కలిగింది.
కాగా, సర్ అర్దర్ కాటన్‌ని గుర్తు పెట్టుకున్నట్లే, పవన్ కళ్యాణ్‌ని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గుర్తు పెట్టుకుంటారని శాసన సభ ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, అమరజీవి జలధార పథకం శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
