Home » ఔను.! అంబటి రాంబాబు ‘బూతు గ్రాఫ్’ పెరిగింది.!

ఔను.! అంబటి రాంబాబు ‘బూతు గ్రాఫ్’ పెరిగింది.!

by hellomudra
0 comments
Ambati Rambabu Amaravati

Ambati Rambabu Vulgar Popularity.. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్రేజ్ పెరిగింది.. గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.!

ఔను, కానీ పెరిగిన గ్రాఫ్.. అతనికి ఏమాత్రం ఉపయోగపడదు. పైగా, నష్టం చేస్తుంది.

గతంలో మంత్రిగా పని చేసిన సమయంలో, పోలవరం ప్రాజెక్టు అస్సలు తనకేమాత్రం అర్థం కాలేదనీ, తనకే అర్తం కాని ఆ ప్రాజెక్ట్ ఈ భూ ప్రపంచమ్మీద ఎవరికీ అర్థం కాదనీ, అంబటి రాంబాబు స్టేట్మెంట్ దంచేశారు.

అంబటి రాంబాబు మీద, సంబరాల రాంబాబు.. అనే ముద్ర వుంది.! సంక్రాంతి సంబరాల నేపథ్యంలో అంబటి రాంబాబు వేసే డాన్సుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇక, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టారంటే చాలు, ‘మనవి చేసుకుంటూ’ పోతుంటారంతే. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన సమయంలోనే, ప్రజలు ఆయన్ని ఛీత్కరించుకున్న పరిస్థితుల్ని చూశాం.

Ambati Rambabu Vulgar Popularity.. బూతుల రాంబాబు..

కాస్త వెనక్కి వెళితే, ప్రజారాజ్యం పార్టీ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్సార్ ఆదేశాలతో, సినీ నటులు జీవిత, రాజశేఖర్‌లను మెగాస్టార్ చిరంజీవి మీదకు ఎగదోసింది కూడా ఈ అంబటి రాంబాబే.

చిరంజీవిని తిట్టాల్సిందిగా అంబటి రాంబాబు తమ మీద తెచ్చిన ఒత్తిడి గురించి పలు సందర్భాల్లో జీవిత, రాజశేఖర్ చెప్పుకుని వాపోయారు మీడియా సాక్షిగా.

చెప్పుకుంటూ పోతే, అంబటి రాంబాబు లీలలు.. అన్నీ ఇన్నీ కావు. కాపులంటే పచ్చి తాగుబోతులంటూ స్టేట్మెంట్లు ఇచ్చింది స్వయానా ఈ కాపు మహా నాయకుడు అంబటి రాంబాబే.!

ఇంత గొప్ప ట్రాక్ రికార్డ్ వున్న అంబటి రాంబాబు, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉపయోగించిన జుగుప్సాకరమైన బూతుల నేపథ్యంలో, అరెస్టయి.. జైలుకు వెళ్లి, బెయిల్ మీద విడుదలయ్యారు.

జైలుకెళ్ళాడంటే మహానాయకుడే..

జైలకు వెళ్ళడమంటే, ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం కదా.! అదీ, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా బూతులు మాట్లాడిన అంబటి రాంబాబు ఇంకెంత గ్రేటు.?

అందుకే, అంబటి రాంబాబు రేంజ్ అమాంతం పెరిగింది. అంబటి రాంబాబుకి ఇప్పుడు జనాల్లో క్రేజ్ మామూలుగా లేదు.!

నలుగురూ నవ్విపోదురు గాక వాళ్ళకేటి సిగ్గు.? అంతే మరి, పెయిడ్ న్యూస్ విషయంలో మీడియా ముసుగేసుకుని కొందరు మాఫియా నడుపుతున్న తీరు చూశాక అలాగే అనిపిస్తుంది.

లేకపోతే, అంబటి రాంబాబు రేంజ్ పెరగడమేంటి.? ఎంత పెయిడ్ న్యూస్‌కి అలవాటు పడిపోతే మాత్రం.. ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తారా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group