Ananya Nagalla Pahalgam Terror.. బెజవాడ వరదల నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిందామె. పెద్ద స్టార్ ఏమీ కాదు. కాకపోయినా, పెద్ద మనసు చాటుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో వరదల కారణంగా కనీ వినీ ఎరుగని నష్టం సంభవిస్తే, ‘నేనున్నా’ అంటూ చేతనైనంత సాయం, ప్రభుత్వాలకు అందించింది.
చాలామంది సినీ ప్రముఖులు సాయం చేశారనుకోండి.. అది వేరే సంగతి. అనన్య, ముందుకు రావడం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది.
అంతే కదా మరి, కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీల కంటే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీలు చేసే సాయానికి గౌరవమెక్కువ.
Ananya Nagalla Pahalgam Terror.. అనన్య పెద్ద మనసు..
తాజాగా, పహల్గామ్‌లో తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ తెలుగోడి కుటుంబాన్ని పరామర్శించింది సినీ నటి అనన్య నాగళ్ళ.

నెల్లూరులో ఓ ఈవెంట్ నిమిత్తం వెళ్ళిన అనన్య నాగళ్ళ, అదే నెల్లూరుకి చెందిన వ్యక్తి పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయారన్న విషయం తెలిసీ, ఆయన ఇంటికి వెళ్ళింది.
బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు తనవంతు ప్రయత్నం చేసింది. అనన్యను అక్కడ అలా చూసినవారు ఆశ్చర్యానికి లోనయ్యారు, ఆమెను పెద్ద మనసుని అభినందించారు.
కాజల్ అగర్వాల్ బుర్ర తక్కువ స్టేట్మెంట్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం, పహల్గామ్ ఘటన మీద భిన్నంగా స్పందించింది. జరిగిన ఘటనను మత కోణంలో చూడొద్దంటూ క్లాస్ తీసుకుంది సోషల్ మీడియా వేదికగా.
హిందువా.? కాదా.? అని అడిగి మరీ, బట్టలు ఊడ దీసి మరీ, పురుషుల మర్మాంగాల్ని చూసి, ఖరారు చేసుకుని.. పహల్గామ్‌లో తీవ్రవాదులు హత్యాకాండకి తెరలేపారు.

ఇలాంటి పరిస్థితుల్లో, ‘మత కోణంలో చూడొద్దు’ అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
యావత్ హిందూ సమాజం, తీవ్రమైన బాధలో వున్నప్పుడు, కాజల్ లాంటోళ్ళు చెప్పే నీతులు, పుండు మీద కారం చల్లినట్లు వుంటాయ్.
Also Read: జనసేన జెండా అవనతం! జాతీయ జెండా ఎందుకలా చేయలేదంటే!
మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌లో. బాధిత కుటుంబాలపై సానుభూతి, దేశంపై భక్తి.. వుంటే, బాధిత కుటుంబాల్ని పరామర్శించి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినదించాలి.
అది చేతకాకపోతే, అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చోవాలి.