Ananya Nagalla Pink Glamour.. చేసింది కొన్ని సినిమాలే.. అందులోనూ, హీరోయిన్‌గా వెండి తెర మీద పెద్దగా గ్లామర్ ఒలకబోసేసిన సినిమాలేమీ చెయ్యలేదు.!
హీరోయిన్.. అనడం కంటే, నటిగా భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ వెళుతోంది పదహారణాల తెలుగందం అనన్య నాగళ్ళ.

సోషల్ మీడియాలో మాత్రం.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వెళుతోందీ బ్యూటీ.!
తాజాగా, ఇదిగో ఇలా శారీ సోయగాల్ని సోషల్ మీడియాలో ఆరబోసేసింది.!
Ananya Nagalla Pink Glamour.. తొంగి తొంగి చూడమాకు..
తొంగి తొంగి చూడమాకు చందమామ.. అంటాడో సినీ కవి.! చూడకుండా ఎలా వుంటారు ఎవరైనా.? చూపు తిప్పుకోనివ్వని సోయగం.. ఇలా చీరకట్టులో అందాలు ఒలికించేస్తోంటే.!
ఉల్లి పొరలాంటి చీర.. ఆపై, కత్తిలాంటి చూపులు.. వెరసి, అనన్య నాగళ్ళ గ్లామర్, కుర్రకారుకి మతులు పోగొడుతోందంటే అతిశయోక్తి కాదేమో.!

గ్లామరస్ హీరోయిన్‌గా అనన్య నాగళ్ళని దర్శక నిర్మాతలెవరూ చూడటం లేదా.? అలాంటి పాత్రల వైపు ఆమె మొగ్గు చూపడంలేదా.?
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
ఏమోగానీ, సరైన గ్లామరస్ రోల్ పడితే.. ముంబై బ్యూటీస్‌కి తానేం తక్కువ.. అని తనను తాను ప్రూవ్ చేసుకునే టాలెంట్ అనన్య నాగళ్ళలో వుంది.!

నటిగా అనన్య నాగళ్ళకి తెలుగులో గుర్తింపు తెచ్చిన పాత్ర అంటే, అది ‘వకీల్ సాబ్’ సినిమాలోనే.!
