Table of Contents
Ananya Panday Liger.. అయ్యో పాపం అనన్య పాండే.! తొలి తెలుగు సినిమాతో చాలా పెద్ద డిజాస్టర్ చవిచూసేసింది.
నిజానికి, పూరి (Puri Jagannadh Liger) సినిమాల్లో నటించిన పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తొలి సినిమాతోనే తట్టాబుట్టా సర్దేసుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఆ లిస్టులో అనన్య పాండే కూడా చేరిపోయిందంతే.! కాకపోతే, అనన్య చాలా చాలా ఆశలే పెట్టుకుంది ‘లైగర్’ మీద.!
ఆ లిస్టులో అనన్య పాండే కూడా..
కంగనా రనౌత్ (Kangana Ranaut), దిశా పటానీ (Disha Patani).. కాస్త వెనక్కి వెళితే అయేషా టకియా (Ayesha Takia).. ఇలా బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చి, ఒకే ఒక్క సినిమాతో ఔట్ అయిపోయారు పలువురు భామలు.
అనన్య పాండే పరిస్థితి కూడా అంతేనా.? మళ్ళీ అనన్య తెలుగులో నటించడం కష్టమేనా.? ‘లైగర్’ రివ్యూస్ చూస్తే, అనన్య మళ్ళీ తెలుగులో కనిపించడం దాదాపు అసాధ్యమేనని చెప్పొచ్చు.

మరీ దారుణంగా అనన్య పాండే (Ananya Panday) నటన మీద కామెంట్లు పడ్డాయి రివ్యూల్లోనూ, సోషల్ మీడియాలో నెటిజనం పేర్కొన్న షార్ట్ రివ్యూల్లోనూ.!
ఎంత చెప్పాడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), అనన్య పాండే (Ananya Pandey) గురించి.?
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda Liger)ఏమన్నా తక్కువ చెప్పాడా.? అనన్య ఏమన్నా తక్కువ మాట్లాడిందా.?
Ananya Panday Liger.. ప్చ్.. టైమ్ బ్యాండ్ అంతే.!
టైమ్ బ్యాడ్.! సినిమా అన్నాక హిట్టూ ఫ్లాపూ సహజమే. తెలిసి తెలిసి ఎవరైనా ఫ్లాప్ సినిమా తీస్తారా.? ఫ్లాప్ సినిమాల్లో నటించాలని అనుకుంటారా.?
అదేంటో, కొందరు బాలీవుడ్ భామలకు అస్సలు టాలీవుడ్ కలిసి రావడంలేదు. విద్యా బాలన్ (Vidya Balan) ‘ఎన్టీయార్ బయోపిక్’లో నటించి, నటిగా మార్కులేయించుకున్నా డిజాస్టర్ చవిచూసింది.
శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) సంగతి సరే సరి. ‘సాహో’ సినిమా సమయంలో ఆమె గురించి ఎన్ని గొప్పలు చెప్పారు.?
ఇంత నిర్దాక్షిణ్యంగానా.?
అవన్నీ ఓ యెత్తు, ‘లైగర్’ భామ అనన్య పాండే (Ananya Panday) ఇంకో యెత్తు.! ప్చ్, అనన్య టైమ్ మరీ బ్యాడ్‌గా వున్నట్టుంది.
Also Read: 10 కోట్ల బహుమతులట.! జాక్వెలైన్ ఫెర్నాండెజ్ చిలిపి ఎ‘ఫైర్’.!
మరీ నిర్దాక్షిణ్యంగా అనన్య పాండే (Ananya Pandey) మీద నెగెటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
అక్కడికేదో కేవలం అనన్య పాండే వల్లనే సినిమా (Liger Movie) నాశనమైపోయిందన్న భావన రౌడీస్ వ్యక్తం చేస్తుండడం కొసమెరుపు.