Table of Contents
Anasuya Bharadwaj Cheppu Theguddi.. అనసూయ భరద్వాజ్.. తెలుసు కదా, పరిచయం అక్కర్లేని పేరిది.! ‘రంగస్థలం’ సినిమా, అనసూయ ఇమేజ్‌ని మార్చేసింది.
జబర్దస్త్ యాంకర్ అనసూయ, ఇప్పుడు ప్రముఖ సినీ నటి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. బుల్లితెరకి కొన్నాళ్ళ క్రితమే దాదాపుగా బై బై చెప్పేసి, పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయింది.
అప్పుడప్పడూ బుల్లితెరపై కనిపిస్తూనే వుందనుకోండి.. అది వేరే సంగతి. సినిమాల్లో మాత్రం చాలా చాలా బిజీ అయిపోయింది.
సోషల్ మీడియా వేదికగా, అనసూయకి అభిమానులు, దురభిమానులు.. వున్నారు. వాళ్ళతో అనసూయకి ‘పంచాయితీలు’ మామూలే.
అదేంటో, విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే, డైరెక్టుగానో ఇన్‌డైరెక్టుగానో ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ వేయడం అనసూయకి ఆనవాయితీగా మారిపోయింది. అది మళ్ళీ వేరే చర్చ.
Anasuya Bharadwaj Cheppu Theguddi.. జనాన్ని పోగేస్తే.. ఇంతే మరి.!
తాజాగా, అనసూయ ఓ దుకాణం ఓపెనింగ్‌కి వెళ్ళింది. అనసూయ సెలబ్రిటీ కదా, జనం బాగానే పోగయ్యారు.. కాదు కాదు, నిర్వాహకులే ఇలాంటివాటికి జనాన్ని పోగేస్తున్నారు.
ఈసారి బాగా చిన్న పిల్లల్ని పోగేశారు సదరు దుకాణం నిర్వాహకులు. అందులో కొందరు ఆకతాయిలు, అనసూయ మీద ఏవేవో కామెంట్లు చేశారట.

ఆ హోరులో ఎవరికీ ఏమీ వినిపించలేదు. అనసూయకి మాత్రం బాగానే వినిపించింది. ఏం కామెంట్ చేశారోగానీ, అనసూయకి చిర్రెత్తుకొచ్చేసింది.
మీ ఇంట్లోని ఆడవాళ్ళతో..
‘చెప్పు తెగుద్ది.. చెప్పు తెగుద్ది..’ అంటూ పదే పదే, ఆ పిల్లల్ని ఉద్దేశించి అనసూయ భరద్వాజ్ గుస్సా అయ్యింది. ‘మీరంతా చిన్న పిల్లలు..’ అంటూ క్లాస్ కూడా పీకింది.
‘మీ ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో ఇలాగే ప్రవర్తిస్తారా.?’ అంటూ అనసూయ, సుద్దులు చెప్పే ప్రయత్నం చేసింది కూడా. అయినాసరే, వింటారా.? ఏంటి ఆ ఆకతాయిలు.
వినరని అనసూయకి కూడా తెలుసు. తెలిసీ, ఎందుకు ‘చెప్పు తెగుద్ది.?’ అంటూ అనసూయ ‘అతి’ ప్రదర్శించినట్లు.? అదంతే, అదో టైపు పబ్లిసిటీ స్టంట్.
ఆకతాయిలు తిరగబడితేనో.?
అక్కడ అంతమంది ఆకతాయిలు వున్నారు.. వారిని కంట్రోల్ చేయడం నిర్వాహకులకు సాధ్యమయ్యే పనే కాదు.! చెప్పు తెగుద్ది.. అనే మాటని, ఆ ఆకతాయిలు సీరియస్‌గా తీసుకుంటేనో.?
పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా వుంటుంది. ఏముంది, ఆకతాయిలు సౌండ్ పెంచితే, అనసూయ నెత్తికెక్కిన అహంకారం దిగిపోద్ది.. ఇంతేగా జరిగేది.?
Also Read: ’ఉప్పు కప్పురంబు‘ రివ్యూ: పురుషులందు పుణ్య పురుషులెవరయ్యా.!
సెలబ్రిటీలు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఒకింత హుందాగా వ్యవహరించాలి. అలా హుందాగా వ్యవహరించలేనప్పుడు, తమ కార్యక్రమాలకు జనం రాకుండా నిర్వాహకులకు ముందే, సూచనలు చేసుకోవాలి.
జనం రావాలి.. గోల చెయ్యకూడదు.. అల్లరి అసలే చెయ్యకూడదు.. చేస్తే, చెప్పు తెగుద్ది.. అంటే, ఏం.. ఆకతాయిల వద్ద చెప్పులు వుండవా.? జర జాగ్రత్త అనసూయా.!