Anasuya Bharadwaj Classy ‘చెప్పేవేమో శ్రీరంగనీతులు.. చేసేదేమో.. డాష్ డాష్’ అనేది వెనకటికి ఓ సామెత. ఆ సామెత అనసూయకు అక్షరాలా వర్తిస్తుందేమోనంటున్నారు నెటిజనం.!
జబర్దస్త్ పుణ్యమా అని హాటెస్ట్ యాంకర్‌గా అనసూయ (Anasuya Bharadwaj) కు మంచి పేరుంది. అదెప్పుడో మానేసినా, అనసూయ ముందు ‘జబర్దస్త్’ ట్యాగ్ అయితే అలాగే వుండిపోయింది.
పలు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. నటన సంగతి తర్వాత.. ముందైతే అనసూయ గ్లామర్‌కి ఫిదా అయ్యేటోళ్ళు చాలామందే వున్నారు.
అదే సమయంలో, అనసూయని ట్రోల్ చేయడానికీ అంతకు మించి.. చాలా ఎక్కువమంది ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు.!

‘ఆంటీ’ అంటే అమ్మడికి అస్సలు నచ్చదు.. ఐటమ్ సాంగ్ అన్నమాట కూడా ఇష్టపడదామెకి.! ఇద్దరు పిల్లలకు తల్లి. అలా అని ఆంటీ అని పిలిచారో.. ఆమెకు ఎక్కడో కాలిపోతుంటుంది. ఎక్కడ లేని కోపం చిర్రెత్తుకొస్తుంది.
ఇక డ్రస్సింగ్ విషయంలో అనసూయ ఆంటీకి సారీ.. అనసూయకి అస్సలు సెన్స్ లేదంటూ చాలా కామెంట్లు వస్తుంటాయ్. అయినా, తన పని తాను చేసుకుపోతుందంతే.! కాదు కాదు ‘గ్లామర్’ చూపించుకుంటూ పోతుందంతే.!
Anasuya Bharadwaj Classy.. అంటే కోపం.. చూపించేదంతా తాపం.!
వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే వుంటుంది అనసూయ తనదైన స్టైల్‌లో. అలా అని అస్సలు తగ్గదు. తగ్తేదేలే.. అంటూ తాజాగా థగ్స్ ఆఫ్ థైస్ రేంజ్‌లో తాజాగా కొన్ని పోజులిచ్చింది అనసూయ.
ఈ ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. ‘ఏమన్నా అంటే అనేశామంటావ్. మరి ఇదేంటీ అనసూయా అరాచకం కాకపోతేనూ.!’ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇంకొంతమందైతే బోర్డర్ దాటి బూతులు కూడా తిట్టేస్తున్నారు. ఎవరేమనుకున్నా అనసూయ మాత్రం డోన్ట్ కేర్ అంతే.!
అనసూయ థగ్స్ ఆఫ్ థైస్..
కారు పైకెక్కి మరీ భారీ అందాల థై షో చేస్తూ రెచ్చిపోయింది అనసూయా భరద్వాజ్. ఓ పక్క విపరీతంగా వైరల్ అవుతూనే.. ఈ పిక్స్‌కి అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లు కూడా పోటెత్తుతున్నాయ్.
అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్నావా.? అంటూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ రేంజ్‌లోనే వుంది మరి, అనసూయ థగ్స్ షో.
Also Read: Happy Birthday Nani: సహజత్వం.! ఖచ్చితత్వం.!
ఇక, అనసూయ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం బుల్లితెర నుంచి పెద్దతెరకు ప్రమోట్ అయ్యి.. అక్కడ చాలా చాలా బిజీగా మారిపోయింది.
మొన్నీ మధ్యనే ‘మైఖేల్’ అనే సినిమాలో నటించింది. ‘పుష్ప 2’లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. చిన్నా చితకా సినిమాలు చాలానే వున్నాయ్ అనసూయ చేతిలో.