Table of Contents
సుకుమార్ పుణ్యమా అని బుల్లి తెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పెద్ద తెరపై గ్రాండ్ ప్రమోషన్ దక్కించుకుందనే చెప్పొచ్చు.
‘రంగస్థలం’ సినిమాలో అనసూయ నటించిన ‘రంగమ్మత్త’ పాత్ర ఆమె కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఎవ్వర్ గ్రీన్ క్యారెక్టర్ అది.
అలాంటి ఓ వెర్సటైల్ క్యారెక్టర్‌ని అనసూయ కోసం క్రియేట్ చేసిన సుకుమార్‌కి అనసూయ ఎప్పుడూ రుణపడి వుంటుంది. ఆ పాత్రతో అనసూయకు వెండితెరపై వేరే లెవల్ క్రేజ్ వచ్చేసింది.
ఆ క్రేజ్‌తో అనసూయ వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. అనసూయ వుందంటే, చాలు ఆ సినిమాకి కొత్త అస్సెట్ యాడ్ అవుతుందన్న భావనకొచ్చేశారు ప్రేక్షకులు.
Anasuya Bharadwaj.. ఆ పేరులోనే వుందేదో మాయ.!
ఫలానా సినిమాలో అనసూయ నటిస్తోంది.. అంటే, ఆమె పాత్ర ఎలా వుండబోతోందో.. అని ఎదురు చూసేంతలా ఆ క్రేజ్ పదింతలైంది.

ఇప్పుడు ‘పుష్ప’ సినిమా దగ్గరికి వచ్చేద్దాం. ‘రంగస్థలం’లో అంత గొప్పగా పండిన రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’లో ‘దాక్షాయణి’గా రూపం మార్చుకుంది.
అయితే, ‘రంగమ్మత్త’ పాత్ర పేలినట్లుగా, దాక్షాయణి పాత్ర ఆకట్టుకోలేకపోయింది. ఓకే అనేదానికన్నా, ఈ పాత్రలో అనసూయని విమర్శించిన వాళ్లే ఎక్కువైపోయారు.
అనసూయ వెరీ ‘స్పెషల్’ గురూ.!
అయితేనేం, సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ హిట్టు లిస్టులో అనసూయ కూడా కొట్టుకెళ్లిపోయింది. కానీ, ‘పుష్ప 2’ కోసం అనసూయ పాత్రని మరింత డిఫరెంట్‌గా తీర్చి దిద్దుతున్నాడట సుకుమార్.
చాలా స్ట్రాంగ్‌గా వుండడమే కాదు, కథకు ఈ పాత్ర కీలక మలుపు అయ్యేలా అనసూయ పాత్రని తీర్చి దిద్దుతున్నాడట సుకుమార్. అనసూయతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడనీ టాక్.
ఒకవేళ అదే జరిగితే, ‘పుష్ప 2’తో అనసూయ క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయమనిపిస్తోంది. కాగా, అనసూయ ఇప్పుడిప్పుడే ఓటీటీ తెరపై కూడా ఫోకస్ పెడుతోంది.
సుకుమార్, రంగమ్మత్తని వదిలేదే లే.!
అనసూయ కీలక పాత్రలో ‘కన్యాశుల్కం’ అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. సుకుమార్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: క్యాన్సర్‌కి చెక్.! ‘వ్యాక్సిన్’ కనిపెట్టేసినట్లే.!
వీరేశలింగం పంతులు గారి ‘కన్యాశుల్కం’ నవల అందరికీ సుపరిచితమే. ఆ నవల ఆధారంగానే అదే టైటిల్‌తో ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నాడు సుకుమార్.
సో, ఓ వైపు సినిమాలూ, మరోవైపు వెబ్ సిరీస్‌లూ.. ఎప్పటిలాగే బుల్లితెర షోలూ, ఈవెంట్లూ.. ఇలా రెండు చేతులా ఫుల్‌గా సంపాదిస్తోంది అనసూయ ఆంటీ.! అమ్మో.! ఆంటీ.. అంటే అనసూయకు చాలా బాగోదు.! అనసూయా భరద్వాజ్.!