Anasuya Bharadwaj Glamour.. ఆ ఏజ్ ఏంటి.? ఆ గేజ్ ఏంటి.? అనే విమర్శలు సర్వసాధారణమే బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కి. బుల్లితెర, వెండితెర.. రెండిటి మీదా అనసూయ హంగామా ఓ రేంజ్‌లో నడుస్తోందిప్పుడు.!
చేతిలో వరుసగా సినిమాలు.. ఇంకో పక్క బుల్లితెరపై స్పెషల్ షోస్.. వెరసి, అనసూయ జోరు మామూలుగా లేదు.!
ఇంతకీ, అనసూయ సక్సెస్ సీక్రెట్ ఏంటి.? కేవలం అందాల ప్రదర్శన మాత్రమేనని అనుకోవడానికి వీల్లేదు. టైమింగ్ చూసుకుని సంచలనాలకు తెరలేపుతుంటుంది. దటీజ్ అనసూయ.
Anasuya Bharadwaj Glamour.. ‘కత్తి’లా కనిపించాల్సిందే మరి.!
గ్లామర్ ప్రపంచంలో గ్లామరస్‌గా కనిపించకపోతే ఎలా.? అని తరచూ ప్రశ్నించే అనసూయ, తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో తోటి యాంకర్‌తో ఏం చెప్పిందో తెలుసా.?
‘యాభయ్యేళ్ళొచ్చినా.. అనసూయ కత్తిలా వుండాలి’ అని అందరూ అనుకోవాలట.!

‘పుష్ప ది రూల్’ వంటి పెద్ద సినిమాలే కాదు, ‘పండుగాడ్’ లాంటి చిన్న సినిమాలూ అనసూయ భరద్వాజ్ చేతిలో వున్నాయ్.
కేవలం గ్లామరొక్కటే అనసూయని ఇలా లైమ్‌లైట్‌లో వుంచుతోందనుకుంటే అది పొరపాటే. నో డౌట్, అనసూయ భరద్వాజ్ హార్డ్ వర్క్ కూడా ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పక తప్పదు.
కోరి వివాదాల్ని తెచ్చుకోనంటున్న అనసూయ..
ఇంతకీ, అడపా దడపా వివాదాల జోలికెందుకు వెళ్ళడం.? అనడిగితే, ‘స్పందించే గుణం నాకు కాస్త ఎక్కువేమో..’ అని సమాధానమిచ్చిన అనసూయ, కోరి వివాదాల్ని కొనితెచ్చుకోనని మాత్రం స్పష్టతనిచ్చింది.
Also Read: కంగనా రనౌత్ పెళ్ళంట.! వాళ్ళతోనే తంటా.!
అన్నట్టు, అనసూయ వయసెంత.? ఆ ప్రశ్నకైతే అనసూయ సమాధానం చెప్పదుగాక చెప్పదు.
అందరూ అనుకుంటున్నట్టు తనది ముదురు వయసు కాదనీ, అయితే.. తనకు పెళ్ళయి.. ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచాల్సిన అవసరమే లేదనీ చెబుతుంటుంది అనసూయ.
చక్కనమ్మ ఏం చెప్పినా అందమేనని అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చెబుతున్న ‘కత్తి లాంటి’ గ్లామర్ సిద్ధాంతం గురించి అనుకోవాలేమో.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ ఫర్ అనసూయ అంతే.!