బిగ్ బాస్ ఫేం దివి వద్త్య ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో కనిపించింది. అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కూడా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించింది.
కానీ, ‘గాడ్ ఫాదర్’ (Godfather Movie) విడుదలకు ముందు ఎక్కడా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె కనిపించలేదు అనసూయ. ‘దివి’ మాత్రం హైద్రాబాద్‌లో జరిగిన ‘గాడ్ ఫాదర్’ ప్రెస్‌మీట్‌లో సందడి చేసింది.
ఎవరో ఓ నెటిజన్, ‘గాడ్ ఫాదర్’లో అనసూయ నటించిన విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ ట్వీటుపై అనసూయ తాజాగా స్పందించింది.
నయనతార బాటలో అనసూయ.!
సినిమాలో కీలక పాత్రలో నటించిన నయనతార కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయలేదు. నయనతార ఎప్పుడూ తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోదు గనుక, ఈ విషయంలో ఆమెను ఏమీ అనలేం.

కానీ, అనసూయ అలా కాదు కదా.! అవసరం వున్న విషయాలకీ, అవసరం లేని విషయాలకీ సోషల్ మీడియాలో స్పందిస్తుంటుంది.
అలాంటప్పుడు, ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమాకి సంబంధించి ఓ ట్వీటు అయినా ఎందుకు వెయ్యలేకపోయింది.? అన్నది నెటిజన్ల ప్రశ్న.
Anasuya Bharadwaj నమ్మండి.. అనసూయ చాలా బిజీ.!
నన్ను నమ్మండి, చాలా షూట్స్‌తో బిజీగా వున్నానంటూ అనసూయ (Anasuya) తాజాగా ట్వీటేసింది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే.. అని కూడా సెలవిచ్చింది.
Also Read: పవన్ అభిమానుల మాల ధారణ.! వాళ్ళకి బాగా కాలినట్టుందే.!
ఎంత షూటింగ్స్‌లో బిజీగా వుంటే మాత్రం, ఆయా సినిమాల్ని ప్రమోట్ చేసుకోకపోతే ఎలా.? అనసూయ ప్రమోట్ చేయడం వల్ల ‘గాడ్ ఫాదర్’ సినిమాకి అదనంగా ఒరిగేదేమీ వుండదు.
ఔను, అనసూయ ‘గాడ్ ఫాదర్’ (Godfather) గురించి ప్రమోట్ చేసుకుని వుంటే, అది ఆమెకే ప్లస్.!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన విషయం విదితమే. సల్మాన్ ఖాన్ కూడా ‘గాడ్ ఫాదర్’ సినిమాని ప్రమోట్ చేశాడు.
అందుకే, తెలుగు నటీమణులకి తెలుగులో అవకాశాలివ్వడానికి తటపటాయిస్తుంటారు దర్శక నిర్మాతలు.