బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ వెండితెర ‘ఖిలాడి’గా (Anasuya Bharadwaj In Khiladi) మారుతోంది. ఈ కి‘లేడీ’ బ్యూటీతో జర జాగ్రత్త అంటోంది ‘ఖిలాడి’ టీమ్. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న విషయం విదితమే.
‘జర్రా జర్రా..’ అంటూ ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) సినిమాలో ఖతర్నాక్ ఐటమ్ సాంగ్ చేసిన హాట్ బ్యూటీ డింపుల్ హయాతీ (Dimple Hayati) ఈ సినిమాలో రవితేజ సరసన ఓ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా వుంది. ఆమె పేరు మీనాక్షి చౌదరి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
‘ప్లే స్మార్ట్.. బికాజ్ దిస్ లేడీ కెన్ బి ది గేమ్ ఛేంజర్..’ అంటూ అనసూయ గురించి చిత్ర బృందం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అంటే, ‘ఖిలాడి’ సినిమాలో అనసూయది అత్యంత కీలకమైన పాత్రగా భావించాలేమో.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాలో అనసూయ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందనీ, ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా, కథని మలుపు తిప్పే ఆసక్తికరమైన పాత్ర అనీ తెలుస్తోంది. మరోపక్క, పాత్ర నిడివి కూడా ఎక్కువే వుండబోతోదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక, ఈ సినిమా కోసం అనసూయ (Anasuya Bharadwaj), భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందట. అదీ సినిమా హీరోయిన్లతో సమానంగానట. ఇదిలా వుంటే, అనసూయ (Anasuya) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది. తమిళంలో ‘ది ఛేజ్’ అనే సినిమాలో అనసూయ నటిస్తున్న విషయం విదితమే. తెలుగులో ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. ‘ఎఫ్3’ సినిమా కూడా చేస్తోంది అనసూయ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో రాబోతోన్న సినిమాలోనూ అనసూయ 30 నిమిషాల నిడివి వున్న పాత్రలో కనిపించబోతోందన్నప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద, వెండితెరపై అనసూయ జోరు పెరుగుతోంది.
బుల్లితెరను (Jabardasth Comedy Show) బ్యాలెన్స్ చేసుకుంటూ, వెండితెరపై అడపా దడపా మాత్రమే కనిపించిన అనసూయ నుంచి ఇకపై మరింత ఎక్కువగా సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ (Anasuya Bharadwaj In Khiladi) వెండితెరపై ఆశించొచ్చేమో.