యాంకర్ సుమ (Anchor Suma), అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్ అంటే మాటలు కాదు. గ్లామరుండాలి.. ఇంకేవేవో లెక్కలుండాలి. సరే, అవన్నీ సుమకి లేవా.? అన్నది వేరే చర్చ. కానీ, ఆమె బుల్లితెరపై మహారాణిలా ఓ వెలుగు వెలిగింది, వెలుగుతూనే వుంది.
కొత్త తరం యాంకర్లు ఎంతమంది వచ్చినాసరే, సుమ యాంకరింగ్ చేస్తే ఆ కార్యక్రమానికి వచ్చే కిక్కే వేరప్పా. సుమ ఆడుతుంది, పాడుతుంది.. అబ్బో, సుమ అసలు ఏం చెయ్యదు చెప్పండి.? అందుకే, బుల్లితెరపై సుమ ఆల్‌రౌండర్ అనేస్తుంటారంతా.
Anchor Suma సుమక్క పంచాయితీ.. ఆ కిక్కే వేరప్పా.!
సీరియస్‌గా కామెడీ చేసేయడం, కామెడీగా సీరియస్ చేసెయ్యడం.. సుమకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడీ ఇంట్రో అంతా ఎందుకంటే, చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరపై వెలిగిపోనుంది సుమ. ఆ సినిమా పేరు ‘జయమ్మ పంచాయితీ’. టైటిల్ అదిరింది కదూ.!

ఊళ్ళో గొడవలన్నిటినీ పరిష్కరించే ‘పెద్దమ్మ’ ఈ జయమ్మ అనుకోవాలా.? ఏమోగానీ, సుమ రోకలితో దంచేసరికి, రోలు బద్దలైపోయింది. అంటే, సుమ సీరియస్‌గానే చాలా కామెడీ చేసేస్తోందని అర్థం. ఇంతకీ, ఈ వెండితెర పంచాయితీ సుమక్కకి ఎందుకట.? ఈ ప్రశ్నచాలామంది ‘సుమ’ అభిమానుల్లో మెదులుతోంది.
ఎందుకు సుమక్కా.. ఎందుకు.?
బుల్లితెరపై ఛాన్సులు తగ్గడంతో, యూ ట్యూబ్ ఛానల్ అనీ, ఇదిగో.. ఇలా సినిమాలనీ సుమ కొత్త వేషాలు వేస్తోందనే కామెంట్లు సోషల్ మీడియాలో మామూలే. కానీ, సుమ ఎవర్ గ్రీన్ యాంకర్.. తెలుగు బుల్లితెర మీద. ఆమె స్టార్‌డమ్ బుల్లితెర మీద అలా అలా ఓ ప్రవాహంలా కొనసాగుతోందంతే.
Also Read: అనసోయగం.! ఎలా.. ఇంతందంగా ఎలా.?
‘జయమ్మ పంచాయితీ’ సూపర్ హిట్టయిపోయి, వరుసగా ఆమె సినిమాల్లో బిజీ అయిపోతే, బుల్లితెర నుంచి కాస్త పక్కకి తప్పుకుంటుందేమోగానీ, బుల్లితెర అయితే సుమక్కని తనంతట తాను వదిలే ప్రసక్తే వుండదని నిస్సందేహంగా చెప్పేయొచ్చు.