Anchor Varshini Sounderajan.. యాంకర్ వర్షణి.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై యాంకర్‌గా అనసూయ, రష్మి, శ్రీముఖి.. అంతటి పేరు కాకపోయినా తనదైన స్టైల్‌లో పేరు సంపాదించుకుంది. అయితే, బుల్లితెరపై వర్షిణిని తింగరిదానిలా ప్రొజెక్ట్ చేశారనుకోండి అది వేరే సంగతి.
బుల్లితెరపై సక్సెస్ అయ్యి, వెండితెరపైనా మెరిసిపోవాలనుకున్న సెలబ్రిటీల్లో అతి కొద్దిమంది మాత్రమే సక్సెస్ కాగలిగారు. కలర్స్ స్వాతి, ఉదయభాను, రష్మి, అనసూయ.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆలిస్టు చాలా పెద్దదే. కానీ, అందరూ పెద్ద తెరపై సక్సెస్ కాలేదు. అనసూయ మాత్రమే స్టార్ డమ్ సంపాదించుకుంది.
Anchor Varshini Sounderajan పక్కా హీరోయిన్ మెటీరియల్
సరే, వర్షిణి విషయానికొచ్చేద్దాం. ఈ మధ్య బుల్లితెరపై వర్షిణి కనిపించడం బాగా తగ్గిపోయింది. మరి వర్షిణి ఏం చేస్తున్నట్లు.? పెద్దతెరపై అవకాశాల వేటలో వర్షణి బిజీగా గడిపేస్తోంది. కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అందులో సుమంత్ హీరోగా వస్తున్నసినిమా ఒకటి. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌తోనూ వర్షిణి ఫుల్ బిజీ.. బిజీ.

అందంతో పాటు హాట్ అప్పీల్ కూడా ఎక్కువే వర్షిణిలో. పక్కా హీరోయిన్ మెటీరియల్. సో, అమ్మడి టార్గెట్ బుల్లితెర కానే కాదు. అయితే హీరోయిన్ అయిపోయిందా.? అంత ఆశ్చర్యపోకండి.దానికి లక్కుండాల్లెండి. వర్షణికి ఆ లక్కుందో లేదో తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. కానీ, ఒక్కసారి సక్సెస్ అయ్యిందా.. తిరుగే వుండదు.
Also Read: పెళ్లి, విడాకులు: హిమజను కూడా పిలవొచ్చుగా.!
ఇదిలా వుంటే, సోషల్ మీడియాలో వర్షణికున్న క్రేజే వేరప్పా. హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో కుర్రోళ్ల లేలేత గుండెలకు సన్నసన్నగా చిల్లు పెట్టేస్తుంటుంది.