Andhra Pradesh Early Elections.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందా.? వుందనే అంటున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి, విజయం సాధించిన రఘురామకృష్ణరాజు, అనూహ్యంగా వైసీపీకి దూరమయ్యారు.
సొంత పార్టీ (YSR Congress Party) మీద విమర్శలు చేస్తూ, ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా.. తనదైన స్టయిల్లో పబ్లిసిటీ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) మీద ‘రాజద్రోహం’ పేరుతో కేసులూ నమోదయ్యాయి.. అరెస్టయ్యారు కూడా.! అది వేరే చర్చ.
Andhra Pradesh Early Elections.. రాజుగారి ముందస్తు జోస్యం..
రఘురామకృష్ణరాజు, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులోనే ఈ మేరకు వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారట.

తెలంగాణ (Telangana) రాష్ట్రంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయన్నది రఘురామకృష్ణరాజు ఉవాచ.!
నిజమేనా.? నమ్మొచ్చా.? రాజుగారి (Narsapuram MP Raghu Rama Krishna Raju) జోస్యంలో విషయమెంత.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే.!
ముందస్తు వస్తే..
ముందస్తు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది.? వైసీపీకి ఈసారి షాక్ తప్పదా.? తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
టీడీపీ (Telugu Desam Party) – బీజేపీ (Bharatiya Janata Party) – జనసేన (Jana Sena Party) కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే, 2014 ఎన్నికల ఫలితం రిపీట్ అవ్వొచ్చు.
అయితే, వైసీపీ ఈసారి దారుణంగా నష్టపోతుందని రఘురామకృష్ణరాజు అంచనా వేస్తున్నారు. ఏమో, రాజుగారి జోస్యం ఏమవుతుందో.!
Also Read: WTC Final Team India.. రోహిత్ సేన ఓటమికి కారణాలేంటి.?
అంతా బాగానే వుందిగానీ, రాజుగారు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారట.? సొంత నియోజకవర్గం నర్సాపురంలో ఎప్పుడు మళ్ళీ అడుగు పెడతారట.?
ఏమో, ఈ విషయమై జోస్యం ఎవరూ చెప్పలేకపోతున్నారు.! 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలా.? అన్న విషయమై రఘురామకృష్ణరాజు మల్లగుల్లాలు పడుతున్నారట.
బీజేపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, టీడీపీ అలాగే జనసేన పార్టీల వైపూ ఆయన చూస్తున్నారట.