Andhra Pradesh రాష్ట్రంలో రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టిపోయాయో నిత్యం చూస్తూనే వున్నాం. అభివృద్ధి శూన్యం.. అజ్ణానం అనంతం.. అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి విడిపోయిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడేళ్ళు గడుస్తున్న సరైన రాజధాని లేదు. ఈ గొడవ ఇలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గులాబీ ముల్లు’ సంకేతాలు షురూ అయ్యాయ్.
ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా పిలుపులు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వస్తున్నాయట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితిని విస్తరిస్తే, ఆ పార్టీని గెలిపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు గులాబీ బాస్ కేసీయార్‌ని కోరుతున్నారట.
కేసీయార్‌ని Andhra Pradesh రాష్ట్రంలో పిలుస్తున్నదెవరబ్బా.?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కేసీయార్ మాట్లాడుతూ పలు అంశాల గురించి ప్రస్తావించారు. అందులో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం దగ్గర్నుంచీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు వెతల గురించీ కేసీయార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పోటీ చేయొచ్చు. కేసీయార్ చెబుతున్నట్లు మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అక్కడి ప్రజలు ఎదురు చూస్తోంటే, అక్కడ కూడా పోటీ చేయొచ్చు.. ఎవరూ ‘కారు’కి అడ్డుపడే ప్రసక్తే వుండదేమో.!
అప్పుడు ఫెడరల్ ఫ్రంట్.. ఇప్పుడేమో గులాబీ ఫ్రంట్..
అయితే, కేసీయార్ ఈ తరహా వ్యాఖ్యలు గతంలో కూడా చేశారు.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పే ఆలోచనల్ని బయటపెట్టారు. ఫెడరల్ ఫ్రంట్.. అంటూ ప్రయత్నాలు చేసి పరిస్థితులు అనుకూలించక మిన్నకుండిపోయారు కేసీయార్.
Also Read: నిస్సిగ్గు రాజకీయం.. ఓ మై సన్.. మదర్స్ హజ్బెండ్..!
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లోకి రమ్మంటూ కేసీయార్‌ని ఎవరు ఆహ్వానించారట.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు అడుగు పెట్టబోతుందట.? ఈ ప్రశ్నలకు సమాధానమెప్పుడు దొరుకుతుందోగానీ, ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయి కూర్చుందిప్పుడు.