Andhra Pradesh Political Junction తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ (Jana Sena Party) పొత్తు పెట్టుకోబోతోందిట.! ఈ కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందట.!
మిత్రపక్షం జనసేనతో (Jana Sena Party) బీజేపీ పొత్తు కొనసాగించే పరిస్థితి లేకపోతే, వైసీపీ (YSR Congress Party) వైపు బీజేపీ (Bharatiya Janata Party) వెళుతుందట.!
అంతేనా.? వైసీపీ – జనసేన కూడా కలిసే అవకాశం వుందట. ఒకవేళ టీడీపీ (Telugu Desam Party) – జనసేన మాత్రమే కలిసి, బీజేపీ గనుక వైసీతో కలిస్తే.. వామపక్షాలు, టీడీపీ – జనసేన కూటమితో కలుస్తాయట.!
Andhra Pradesh Political Junction ఏది నిజం.?
ఎవరితో ఎవరు కలుస్తారన్నదానిపై ఇప్పుడే ఓ అంచనాకి రావడంలో అర్థం లేదు. ఎందుకంటే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందర పొత్తులపై పూర్తి స్పష్టత వస్తుంది.
ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలనగా పొత్తులపై ఊహాగానాలంటే అందులో అర్థం వుంటుంది. ఏడాది ముందర పొత్తులంటే, అది అర్థం పర్థం లేని వ్యవహారమే.

ఇంతకీ ఎవరితో ఎవరు కలిస్తే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి లాభం.? ఎవరు ఎవరితో కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం.?
విభజన కంటే పెద్ద నష్టమేముంటుంది.?
ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, రాజధాని లేని రాష్ట్రమైపోయింది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh). పేరుకే అమరావతి రాజధాని. కానీ, అదీ అయోమయంలో వుందిప్పుడు.
ఇంతకంటే కొత్తగా రాష్ట్రానికి (Andhra Pradesh) కలిగే నష్టమేముంది.? ఎవరు ఎవరితో కలిసినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Andhra Pradesh Special Category State) గురించి మాట్లాడాలి. చాలా ముఖ్యమైన అంశమిది.
Also Read: క్యాన్సర్‌ని నివారించలేమా? పెంచి పోషిస్తున్నది మనమే కదా?
అంతే కాదు, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project), రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone), రాజధాని (Andhra Pradesh Capital).. ఇవీ ప్రాధాన్యతాంశాలు. ఇంకా మాట్లాడుకోవాల్సినవి చాలానే వున్నాయ్.
దురదృష్టమేంటంటే, ముఖ్యమైన.. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు పక్కకు పోయి, ఎవరు ఎవరితో కలుస్తారు.? అన్నదానిపై అనవసర రచ్చ జరుగుతోంది.
సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకునే పాలకులు కాదు కావాల్సింది.! పైన చెప్పుకున్న ప్రాధాన్యతాంశాలపై చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం రాష్ట్ర ప్రజలకు కావాలి.!
ప్రజలు ఆ దిశగా ఆలోచించాలి, చైతన్యవంతులవ్వాలి. కానీ, సాధ్యమయ్యే పనేనా ఇది.? ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన రాజకీయం చేయగలవా.?