Ante Sundaraniki Trailer Review.. అసలేంటి సంగతి.? అంటే సుందరానికీ.. అని గ్యాప్ ఇచ్చారేంటి.? అసలేముంది ‘అంటే సుందరానికీ..’ సినిమాలో.!
ఏదో వుంది. కడుపుబ్బా నవ్వించేంతటి కంటెంట్ వుంది. కాకపోతే, అసలు విషయమేంటి.? అన్నదానిపై బోలడంత సస్పెన్స్.!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘అంటే సుందరానికీ..’ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సరసన నేచురల్ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Fahaad) హీరోయిన్‌గా నటించింది ఈ సినిమా కోసం.
సద్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అబ్బాయ్.. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన అమ్మాయ్ మధ్య ప్రేమాయణం.. ఈ క్రమంలో ఇద్దరికీ ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారనే విషయం అర్థమవుతోంది.
వినోదాత్మకమంటే మామూలుగా కాదు.. అంతకు మించి అనే స్థాయిలోనే.. అని ప్రోమోస్‌తో చిత్ర బృందం చెప్పకనే చెప్పేస్తోంది.
ఇద్దరూ ఇద్దరే.. అటు నాని, ఇటు నజ్రియా.. ఇద్దరూ తగ్గేదే లే.. అంటున్నారు. ‘ఏం కాదు..’ అంటూ ధీమాగా చెబుతున్నాడుగానీ, లోపల బోల్డంత ఆందోళన చెందుతున్నాడు సుందరం.. అదేనండీ సినిమాలో హీరోగా నటించిన నాని.
నజ్రియా అయితే కూల్ అండ్ లవ్లీ.. అంతేనా, అక్కడక్కడా సీరియస్ అయిపోతోంది కూడా. నరేష్ తదితరులూ వున్నంతలో కామెడీ పండించేస్తూనే, సుందరాన్ని కంట్రోల్ చేసేస్తున్నారు.
Ante Sundaraniki Trailer Review అదిరిందంతే.!
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ టాప్ క్లాస్‌లోనే వున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే, బొమ్మ సూపర్ హిట్.. అనే నమ్మకం ఎవరికైనా ఇట్టే కలుగుతుంది.
Also Read: పాన్ ఇండియా పైత్యమా.! గౌరవం కాదు, అవమానమా.!
చాలాకాలం తర్వాత నాని నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ రోల్ చూస్తున్నాం.. అన్నది చాలామంది చెబుతున్నమాట.
కామెడీ అంటే నానికి కొట్టిన పిండి.. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫుల్ ఫీస్ట్ అన్నమాట ఈ ‘అంటే సుందరానికీ..’ సినిమా.