Table of Contents
Anu Emmanuel Japan Bomma.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్.
తొలి సినిమాకే యూత్‌ని తెగ ఆకట్టేసుకుందీ బ్యూటీ బొమ్మ. ఆ ఆకర్షణే వరుస అవకాశాలతో దూసుకెళ్లేలా చేసింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది.
అప్పటి వరకూ చిన్న హీరోలతోనే సరిపెట్టుకున్న అనూ, ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించేసుకుంది.
Anu Emmanuel Japan Bomma.. క్రేజీ ఆఫర్స్ పట్టేసింది గానీ.!
ఇంకేముంది..! అనూని పట్టుకోవడం ఇక వల్ల కాదనుకున్నారంతా. ఏం జరిగిందో ఏమో, స్టార్ ఛాన్సులు రావడంతో అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

బిగ్ ప్రాజెక్టులు పట్టేసిందన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు అనూ ఇమ్మాన్యుయేల్‌కి. ఈ రెండు బిగ్ ప్రాజెక్టులూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ కావడంతో అనూ ఇమ్మాన్యుయేల్ ఐరెన్ లెగ్ అయిపోయింది.
ఆ తర్వాత నుంచీ అవకాశాలు కరువయ్యాయ్. అరా కొరా అవకాశాలు వచ్చినప్పటికీ అవేమీ అనూ ఇమ్మాన్యుయేల్ ( Anu Immanuel ) కెరీర్‌ని కాపాడలేకపోయాయ్.
హిట్టంటే హిట్టు.. ఫట్టంటే ఫట్టు.!
రీసెంట్‌గా అల్లు కాంపౌండ్ హీరో శిరీష్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనూ ఇమ్మాన్యుయేల్.
బలవంతంగా హిట్టు లిస్టులోకి తోసేశారు ఈ సినిమాని. అది అనూకి కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చేమో. ఆ తర్వాత మళ్లీ ఈ మధ్యనే ఆఫర్లు దక్కించుకుంటోంది అనూ ఇమ్మాన్యుయేల్.
Also Read: Keerthy Suresh Mystery Man.! మహానటీ ఎవరే అతగాడు.?
వెరీ లేటెస్ట్‌గా మాస్ రాజా రవితేజ సరసన ‘రావణాసుర’లో కనిపించింది. ఈ సినిమాలో అనూతో పాటూ ఇంకా చాలా మంది హీరోయిన్లుండడంతో గుంపులో గోవింద అన్నట్లుగా కొట్టుకు పోయింది.
‘జపాన్’తోనైనా దశ తిరగేనా.?
అయినా కానీ, ఓ మంచి ఛాన్స్ అనూ ఇమ్మాన్యుయేల్ ( Anu Immanuel )ని వరించింది. అది తమిళ హీరో కార్తి రూపంలో.
కార్తి హీరోగా వస్తున్న ‘జపాన్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

చూడాలి మరి, ఈ సినిమాతో అయినా అనూ ఇమ్మాన్యుయేల్ దశ తిరుగుతుందేమో. అన్నట్లు సినిమాల సంగతెలా వున్నా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో అనూ పాప ఎప్పుడూ పిచ్చెక్కిస్తూనే వుంటుంది.
అందులో భాగంగానే తాజాగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయ్. అటు వైపు మీరూ ఓ లుక్కేస్కోండి.