AnuKreethy Vas Indian Islands.. మాల్దీవ్స్ వివాదం నేపథ్యంలో, మన దేశంలోనే మన విహారం.. అనే కొత్త నినాదం షురూ అయ్యింది. ఈ లిస్టులోకి చేరింది ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫేం అనుక్రీతి వాస్.!
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో అనుక్రీతి వాస్ ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా, మాల్దీవ్స్ వివాదంపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది అనుక్రీతి.! మన దేశంలోని ఐలాండ్స్‌ని సందర్శిద్దామనీ, మన సొమ్ముల్ని విదేశాల్లో ఖర్చు చేయడం మానేసి, మన దేశంలో ఖర్చు చేద్దామని పిలుపునిచ్చిందామె.
AnuKreethy Vas Indian Islands.. లెక్క మారిందిప్పుడు..
భారతదేశంలో అత్యంత సుందరమైన ఐలాండ్స్ ఇప్పుడు తాజాగా ప్రపంచానికి సరికొత్తగా పరిచయమవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించాక, మాల్దీవుల్లో కొందరు ప్రజా ప్రతినిథులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.
అక్కడ మొదలైన వివాదం, మాల్దీవ్స్‌లో విహార యాత్రలకు మన ఇండియన్ సెలబ్రిటీలు గుడ్ బై చెప్పేదాకా వెళ్ళింది పరిస్థితి.

నిజానికి, ఈ పని ఎప్పుడో చేసి వుండాల్సింది. కాస్త ఆలస్యమైనా.. మన దేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల పట్ల మన సెలబ్రిటీలకు బాధ్యత తెలిసొచ్చినందుకు ఆనందించాల్సిందే.
మాల్దీవ్స్‌లో మన సెలబ్రిటీలు చేస్తున్న ఖర్చు, మన దేశంలోనే చేయగలిగితే, దేశ ఆర్థిక పరిస్థితికి అది మరింత ఊతమిస్తుంది.
పైగా, పర్యాటక రంగంలో కొలువులూ పెరుగుతాయ్.! తద్వారా నిరుద్యోగమూ తగ్గుతుంది.