Anupama Parameswaran Big Trouble.. చాలా పెద్ద కష్టమే వచ్చింది పాపం.! ఔను కదా, ఎంత పెద్ద కష్టమొచ్చిందో ఈ భామకి.! ఈ కష్టాలన్నీ అందాల భామలకే ఎందుకొస్తాయబ్బా.?
ఇంతకీ, ఆ కష్టమేంటి.? అబ్బో, చెప్పనలవి కానంత కష్టం సుమీ.! సోది ఆపి, ఆ కష్టం గురించి చెప్పండి మహాప్రభో.. అంటారా.? చెప్పేసుకుందాం పదండిక.!
అనుపమ పరమేశ్వరన్ తెలుసు కదా.? మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది.. నటిస్తూనే వుంది. తాజాగా, ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యింది.
అదిగో మళ్ళీ.. ఆ ‘కష్టం’ గురించి చెప్పకుండా.. ఈ ఉపోద్గాతం ఇంకెంత సాగదీస్తారబ్బా.? అనుకుంటున్నారా.? తప్పదు.. ఇవన్నీ చెప్పుకుని తీరాల్సిందే.
Anupama Parameswaran Big Trouble.. ముద్దు ముచ్చట..
లిప్ లాక్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం.. సినిమాల్లో లిప్ లాక్స్ గురించే సుమీ.! రియల్ లైఫ్‌లోనూ అవి చాలా సర్వసాధారణమైపోయాయ్.. అది వేరే చర్చ.
రొమాంటిక్ సీన్స్ సినిమాల్లో ఇంకా సర్వసాధారణం. అడల్ట్ కంటెంట్ అనదగ్గ స్థాయిలో సినిమాల్లో రొమాన్స్‌ని నింపేస్తున్నారు.

తానేం తక్కువ కాదంటూ ఆల్రెడీ అనుపమ పరమేశ్వరన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టేస్తోంది. కాకపోతే, ‘టిల్లు స్క్వేర్’ కోసం డోస్ ఇంకాస్త పెంచింది.
అద్గదీ అసలు సంగతి.! ఇంతకీ, అంతలా ఎందుకు ‘మసాలా ఘాటు’ పెంచాల్సి వచ్చింది.? అనడిగితే, ‘నేనూ మనిషినే కదండీ.. భిన్నమైన సినిమాలు చేయాలని నాకూ వుంటుంది కదా..’ అని పుసుక్కున క్యూటుగా ఎదురు ప్రశ్న వేసేసింది అనుుపమ.
Also Read: డబ్బు కోసం దిగజారలేను: నివేదా పేతురాజ్
అసలు ఇక్కడ మసాలా ఘాటుకీ, భిన్నమైన పాత్రలకీ ఏమన్నా సంబంధం వుందా.? ప్చ్.. వుందేమో.. మనమే ఇంకా అంత ఎడ్యుకేట్ అవలేదంతే.!
ఛత్.. హాట్ కంటెంట్ వున్న సినిమాల్లో నటించడం ఎంత కష్టమో మీకేం తెలుసు.? అని నిలదీసేసింది అనుపమ పరమేశ్వరన్. ఔనా.? మాకైతే తెలీదులే.. అంటూ జనం సెటైర్లేస్తున్నారు.

తెరపై శృంగార రసం ఒలకబోసెయ్యడమంటే, అదో ఆర్టు.! దాదాపు అందరు అందాల భామలూ చేసే పని అదే. ట్రెండ్ మారింది.. దీన్ని తప్పు పట్టలేం ఇప్పుడు.
కానీ, ‘చాలా కష్టం తెలుసా.?’ అని అమాయకంగా అనుపమ ప్రశ్నిస్తోంటేనే కామెడీగా వుంది.! వుండదా మరి.?