Anupama Parameswaran Kishkindhapuri.. ’కిష్కింధపురి‘ పేరుతో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ఇది. కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇదొక థ్రిల్లర్.. హర్రర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘కిష్కింధకాండ’ సినిమా ప్రమోషన్స్ కూడా అదే తరహాలో షురూ చేశారు.
Anupama Parameswaran Kishkindhapuri.. అనుపమకి ఆసక్తి లేదా.?
సాధారణంగా అనుపమ పరమేశ్వరన్ తాను ఏ సినిమాలో నటించినా, ఆ సినిమా ప్రమోషన్స్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొంటుంటుంది.
అయితే, ‘కిష్కింధకాండ’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, ఓ సినీ ఎర్నలిస్ట్ ‘ఏంటి అన్ ఇంటరెస్టెడ్‌గా కనిపిస్తున్నారు.?’ అంటూ ప్రశ్నించాడు.

ఈ మధ్య ఏ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్‌కి వెళ్ళినా, సినీ సెలబ్రిటీలను పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించడం, నాన్సెన్స్ క్రియేట్ చేయడం సోకాల్డ్ ఎర్నలిస్టులకు అలవాటుగా మారిపోయింది.
ఇక, తనకు ఎదురైన ‘అన్ ఇంటరెస్టెడ్’ క్వశ్చన్‌కి అనుపమ పరమేశ్వరన్ మాత్రం, ఇంటరెస్టెడ్‌గానే సమాధానమిచ్చి, సదరు ఎర్నలిస్టుకి గూబ గుయ్యిమనేలా చేసింది.
ఇంటరెస్ట్ లేకపోతే, ప్రమోషనల్ ఈవెంట్‌కి వచ్చేదా.?
సినిమాలో నటించాక, దాన్ని ప్రమోట్ చేసుకోవాలనే అనుకుంటారు సినిమాకి పని చేసినవారెవరైనా సరే. అది వాళ్ళ బాధ్యత.
చాలా తక్కువమంది మాత్రమే, తమ సినిమాల ప్రమోషన్లను పట్టించుకోరు. అది వేరే చర్చ. అనుపమ అలా కాదు, ప్రతి సినిమా విషయంలోనూ, ప్రమోషన్స్ అవసరమే.. అని నమ్ముతుంది.
అనారోగ్యం కారణంగా, ఒకింత నీరసంగా కనిపించింది అనుపమ పరమేశ్వరన్. ఇదే విషయాన్ని అనుపమ స్పష్టంగా చెప్పింది.

అన్ ఇంటరెస్టెడ్ కాదు, జ్వరం.. అందుకే, నీరసంగా వుంది.. అని అనుపమ పరమేశ్వరన్ చెప్పేసరికి, సదరు సినీ ఎర్నలిస్టు మొహం మాడిపోయింది.
ఇదిలా వుంటే, అనుపమ కొద్ది రోజుల క్రితం ‘పరదా’ అనే సినిమాలో నటించింది. ‘పరదా’ ప్రమోషన్ల కోసం అనుపమ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
మలయాళీ ముద్దుగుమ్మ అయినా, తెలుగు నేర్చుకుని.. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది అనుపమ.