Anurag Kashyap Taapsee Pannu.. అనురాగ్ కశ్యప్.. ప్రముఖ ఫిలిం మేకర్.! ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారాయన.
తాప్సీ పన్ను గురించి కొత్తగా చెప్పేదేముంది.? అటు గ్లామర్ డాల్.. ఇటు మంచి నటి కూడా.! తాప్సీ, అనురాగ్ కశ్యప్.. ఈ ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చారు తాజాగా.!
తమ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చి, అడ్డగోలు వేషాలు వెయ్యడం ఇటీవల సెలబ్రిటీలకు ఓ సరదా వ్యవహారంగా మారిపోయింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ అర్ధనగ్న ఫొటో షూట్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన విషయం విదతమే. ఆయన మీద పోలీస్ కేసు కూడా నమోదయ్యింది.
Anurag Kashyap Taapsee Pannu.. కెలికి కామెడీ అయిపోయాడు.!
రణ్‌వీర్ వివాదంపై స్పందించమని అడిగితే, తానొక వివాదాన్ని బహుమతిగా ఇచ్చాడు. తాప్సీ యెద భాగంతో, తన యెద భాగాన్ని పోల్చుకున్నాడు అనురాగ్ కశ్యప్.

దీన్నే పబ్లిసిటీ రోగం అంటారు.! లేకపోతే, పక్కన ఓ మహిళ వుండగా, ‘ఆమె వక్షోజాలతో తన వక్షోజాలతో’ పోల్చుకోవడమేంటి.? బరితెగింపుకే పరాకాష్ట ఇది. అత్యంత హేయమైన వ్యవహారమిది.
సెటైరికల్ కామెడీ చేశాననుకున్నాడుగానీ, ప్రముఖ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తన ‘రోగ్’తత్వాన్ని ఆయన బయటపెట్టుకున్న వైనం అందరికీ స్పష్టంగా అర్థమయిపోయిందనేది సర్వత్రా వ్యక్తమవుతున్న వాదన.
ఇంతలా దిగజారాలా.?
కేవలం దిగజారుడుతనంతోనే పబ్లిసిటీ పొందచ్చన్న భావన ఇటీవల సెలబ్రిటీల్లో పెరిగిపోయింది. అందుకు అనురాగ్ కశ్యప్ వ్యవహారం తాజా నిదర్శనం మాత్రమే.
Also Read: ప్రేక్షకులు దేవుళ్ళే.! కుప్పిగంతులేస్తే, తాట తీస్తారు సుమీ.!
సాధారణంగా ఇలాంటి విషయాల్లో సీరియస్‌గా స్పందించే తాప్సీ (Taapsee Pannu), తనను ‘వక్షోజాల సైజు’ విషయంలో ప్రస్తావించి, పోల్చి చూసి అవమానించిన అనురాగ్ విషయంలో ఎందుకు సైలెంటుగా వుంది.?
ఏమోగానీ, రోజురోజుకీ సెలబ్రిటీలు తమ స్థాయిని దిగజార్చేసుకుంటున్నారు. ఇలాంటోళ్ళని మీడియా కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తోంది.!
పిల్ల ముందా.? గుడ్డు ముందా.? సెలబ్రిటీలది తప్పా.? మీడియాది తప్పా.?