Anushka Shetty Ghaati.. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.! ఆమెను అంతా స్వీటీ అని పిలుస్తారు కూడా.! నిజంగానే, అనుష్క చాలా ‘స్వీట్’ పర్సనాలిటీ కలిగిన హీరోయిన్.
అలాంటి అనుష్క శెట్టి పాత్రలో తెరకెక్కిన ‘ఘాటి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోందంటే, అన్ని వైపుల నుంచీ పాజిటివిటీ వుండడం సహజమే.
గత కొంతకాలంగా సినిమాల పరంగా వేగం తగ్గించింది అనుష్క. ఇది అందరికీ తెలిసిన విషయమే. వ్యక్తిగత కారణాల రీత్యా, ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.
చాలా సెలక్టివ్‌గానే అనుష్క సినిమాలు చేస్తోంది. అయినాగానీ, సక్సెస్ ఫెయిల్యూర్.. వీటితో సంబంధం లేకుండా, అనుష్క స్టార్‌డమ్ అలానే వుంది.
Anushka Shetty Ghaati.. ప్రమోషన్స్‌లో అనుష్క రూటే సెపరేటు..
ఇక, అనుష్క ఏదన్నా సినిమాలో నటిస్తే, ఆ సినిమా ప్రమోషన్ల విషయమై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. జాగ్రత్తలు.. అనడం కంటే, బాధ్యత.. అనడం సబబేమో.
సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో అనుష్క శెట్టి సమ్‌థింగ్ స్పెషల్. అందుకే, అనుష్కతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు.
కానీ, ‘ఘాటీ’ సినిమా ప్రమోషన్లలో అనుష్క ఎక్కడా కనిపించడంలేదు. ఇదే విషయమై మేకర్స్‌కి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైతే, ‘అనుష్క ముందే చెప్పేసింది’ అంటున్నారు.

ముందే చెప్పేయడమేంటో మరి.! అనుష్క వస్తే, సినిమాకి ఎడ్జ్ ఇంకాస్త బెటర్‌గా వుంటుందన్నది నిర్వివాదాంశం. రాత్రికి రాత్రి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి కూడా.
అయితే, అనివార్య కారణాల వల్ల తాను సినిమా ప్రమోషన్లకు రాలేనని, నిర్మాణ సంస్థతో ముందే అనుష్క చెప్పేసిందన్నది, ‘ఘాటీ’ యూనిట్ నుంచి వస్తున్న వివరణ.
Also Read: Ronth Telugu Review: ఆ రాత్రి.. ఆ ఇద్దరు పోలీసులు ఏం చేశారు.?
సరైన సినిమా పడితే, అనుష్క ఏకంగా వంద కోట్ల క్లబ్బులో చేరగల స్టామినా వున్న నటి.. అని వేరే చెప్పాలా.? ‘బాహుబలి’, ‘భాగమతి’ చిత్రాల తర్వాత, ఆ స్థాయి పవర్ వున్న రోల్స్, అనుష్కకి పడలేదు.
‘ఘాటీ’తో అలాంటి పవర్ మళ్ళీ అనుష్క పాత్రలో చూస్తామా.? వేచి చూడాలిక.