AP Political Exam Results.. పదో తరగతి పాసై, ఇంటర్మీడియట్‌లో చేరాలనుకున్నారు కొందరు.
ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా వైపు ఆలోచనలు చేశారు ఇంకొందరు. కానీ, ‘ఫెయిల్’ అనే మాట పిడుగులా విద్యార్థుల నెత్తిన పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలొచ్చాక, చాలామంది విద్యార్థులు ఆశ్చర్యపోయారు, కొందరు హాహాకారాలు చేశారు.
అన్ని సబ్జెక్టుల్లోనూ 90కి పైగా మార్కులొచ్చాయ్.. ఓ సబ్జెక్టులో మాత్రం 70 లోపు మార్కులొచ్చాయ్.! ఎక్కడ తేడా కొట్టినట్లు.? అని ఓ విద్యార్థి తల బాదుకున్నాడు.

గత ఏడాది, అంతకు ముందు ఏడాది నేరుగానే పాస్ చేసేశారుగా.. వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా.? అంటూ ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు, ప్రభుత్వాన్ని నిలదీసేశారు.
AP Political Exam Results.. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందెవరు.?
విద్యా వ్యవస్థ ఇంతలా ఎందుకు భ్రష్టు పట్టిపోయింది.? ఈ చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు ఒకాయన మాట్లాడుతూ, ‘ఇంగ్లీషు మీడియం ప్రభావం వల్లనే ఇలా జరిగి వుండొచ్చేమో.. ఇప్పుడైతే ఫలితాలు బాగా లేవు. కానీ, భవిష్యత్తులో ఆశాజనకమైన ఫలితాలొస్తాయ్..’ అని అంటున్నారు.
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయితే జీవితం ముగిసిపోదు. కానీ, విద్యార్థుల ఆశల్ని ఆ ‘ఫెయిల్’ అన్న మాట చిదిమేస్తుంది.
గత ఏడాది ఒక న్యాయం.. ఈ ఏడాది ఇంకో న్యాయమేంటి.? అని ఆ చిన్ని మెదళ్ళలో, పెద్ద ఆలోచన వస్తే.. అది అస్సలేమాత్రం సమాజానికి మంచిది కాదు.!
రాజకీయమే అసలు సమస్య.!
కోవిడ్ పాండమిక్ ప్రభావాన్ని అందరం చూశాం. కానీ, ప్రచారం మీద వున్న శ్రద్ధ ప్రభుత్వ పెద్దలకు విద్యార్థుల భవిష్యత్తు మీద లేకపోవడంతోనే ఈ దుస్థితి అన్న కఠోర వాస్తవాన్నీ విస్మరించలేం కదా.?
Also Read: దిశ ఎన్‌కౌంటర్.! ఏది బూటకం.? ఏది న్యాయం.?
రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయ్. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా అంతే.!
విద్యార్థులే తమ భవిష్యత్తు విషయంలో శ్రద్ధగా వుండాలి. ఫెయిలైతే, ‘పోయి’నట్టు కాదు.! మరింత పట్టుదలగా జీవితంలో ముందుకు వేగంగా పరిగెత్తేందుకు ప్రయత్నించాలి.!
నేటి బాలలే రేపటి పౌరులు.! ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఎందుకు తగలడిందన్న కోణంలో ఒకింత స్టడీ చెయ్యాలి. ఆ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం తమవంతుగా మెరుగైన ఆలోచనలు చెయ్యగలగాలి.
అప్పుడే, భవిష్యత్ తరాలు ఈ రాజకీయ పరీక్షలకు బలైపోకుండా వుంటాయ్.!