Artificial Intelligence AI Creativity.. హలో హలో.! నేను కాఫీ తాగుతున్నట్లు ఓ ఫొటో క్రియేట్ చేస్తావా.?
ఏమోయ్, నన్ను సూపర్ మ్యాన్‌లా డిజైన్ చేసి ఓ ఫొటో ఇవ్వొచ్చు కదా.!
రేయ్ మావా.. నాకో మాంఛి లోగో డిజైన్ చేసి ఇవ్వవా.?
అడిగినోళ్ళకి అడిగినంత.! ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం.! జెమినీ, చాట్ జీపీటీ, గ్రోక్.. చెప్పుకుంటూ పోతే, బోల్డంతమంది అసిస్టెంట్లున్నారు.. మనక్కావాల్సినవి చేసి పెట్టడానికి.
Artificial Intelligence AI Creativity.. ఇది డిజిటల్ యుగం..
డిజిటల్ యుగం.. ఈ కొత్త అసిస్టెంట్లు.. చాలా పనులు చేసి పెడుతున్నారు. నిజంగానే చాలా చాలా పనులు చేసి పెడుతున్నారు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అసిస్టెంట్లు.
పైన ఫొటో చూస్తున్నారు కదా.. సినీ నటి జ్యోతి పూర్వజ్ ఫొటో అది. టీవీ సీరియళ్ళతో పాపులర్ అయి, ఇప్పుడు సినిమాలు చేస్తోందీ బ్యూటీ.
చేత్తో కాఫీ కప్ పట్టుకుని.. ఎవరి రాక కోసమో నిరీక్షిస్తోంది జ్యోతి పూర్వజ్. ఇది ఒరిజినల్ ఫొటో అనుకుంటే పొరపాటే. దీన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేశారు.
మరో ఫొటోలో.. సినీ నటి కాజల్ అగర్వాల్ కనిపిస్తోంది. ఆమెని బికినీలో ఓ బొమ్మలా తయారు చేశారు. కంప్యూటర్ టేబుల్ మీద.. ఆ బొమ్మ.. ఎంత అందంగా అమరిపోయిందో కదా.!
ముందు ముందు బోల్డన్ని వింతలు చూడబోతున్నాం..
ఇంకా చాలా వింతలు, విడ్డూరాలూ చూడబోతున్నాం. పూర్తిగా ఏఐ ఆధారిత సినిమాలూ రూపుదిద్దుకుంటున్నాయి. వాటి రాకతో, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలకు కాలం చెల్లుతుందేమో.!
మొన్నీమధ్యనే వీఎఫ్ఎక్స్ సాయంతో చేసిన ‘మహావతార్ నరసింహ’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చూశాం కదా.!
Also Read: కింగ్డమ్ రివ్యూ: గజిబిజి గందరగోళమ్.! టోటల్ బోర్డమ్.!
అగ్ర హీరోలతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తే, ‘మహావతార్ నరసింహ’ అనే వీఎఫ్ఎక్స్ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.
అలానే, నటీనటులు తమ ఒరిజినల్ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసినా.. వాటికి మించి, ఏఐ ఆధారిత ఫొటోలకు క్రేజ్ పెరగనుంది ముందు ముందు.!