భూమ్మీద ఒకప్పుడు డైనోసార్లు వుండేవి.. కానీ, ఇప్పుడవి లేవు. లక్షల ఏళ్ళ క్రితమే అవి అంతమైపోయాయి. అలా డైనోసార్లు అంతమైపోవడానికి కారణమేంటి.? అంటే, ఓ సిద్ధాంతం ప్రకారం, భారీ గ్రహశకలం భూమ్మీద పడటంతో భారీ విస్ఫోటనాలు భూమ్మీద (Asteroid Earth) సంభవించి.. విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి.. డైనోసార్లు అంతమైపోయాయన్నది ఓ సిద్ధాంతం తాలూకు సారాంశం.
మరి, ఇన్నేళ్ళలో గ్రహశకలాలు భూమిని తాకలేదా.? అంటే, ఎందుకు తాకలేదు.. నిత్యం తాకుతూనే వుంటాయ్.. చిన్నవో, పెద్దవో. ఆకాశంలోంచి ఎప్పుడూ ఏదో ఒక వస్తువు భూమ్మీద పడుతూనే వుంటుంది. అయితే, చాలా చిన్న పరిమాణంలో వుంటాయవి. చాలావరకు భూ వాతావరణంలోకి ప్రవేశించేసరికే కొన్ని బూడిదైపోవడమూ జరుగుతుంటుంది.
గ్రహశకలాలు దూసుకొస్తే ఏమవుతుంది.?
ఫలానా సంవత్సరంలో భూమ్మీదకు పెద్ద గ్రహశకలం దూసుకు రాబోతోందని అడపా దడపా వార్తల్లో చూస్తుంటాం. శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలకు సంబంధించిన కథనాలే అవి. ఔను, భూమ్మీదకు పెద్ద శకలాలూ వచ్చిపడే అవకాశం లేదు. అలా పడే శకలాలకు సంబంధించి ముందుగానే పసిగట్టేలా మనం సాంకేతికతను అభివృద్ధి చేసుకున్నాం కూడా.

కానీ, విశ్వమంటేనే.. అనేక రహస్యాల పుట్ట. ఆ విశ్వంలో భూమి జస్ట్ ఓ ఇసుక రేణువంత. మరి, అనంత విశ్వం నుంచి ఎప్పుడెలాంటి ప్రమాదం వస్తుందో ముందే ఎలా ఊహించగలం.? మానవ మేధస్సు పరిధిలో, మనల్ని మనం రక్షించేందుకు వున్న అవకాశాల్ని ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే వుంటాం.
గ్రహశకలాలు భూమిని నాశనం (Asteroid Earth) చేసే అవకాశముందా.?
కొన్ని గ్రహశకలాల రాకను ముందే ఊహిస్తుంటాం.. ఆ ఊహలు, అంచనాలకు తగ్గట్టే ఆ శకలాలు భూమికి కాస్త దూరంలోకి వచ్చి వెళ్ళిపోతుంటాయ్. కొన్ని చడీచప్పుడూ లేకుండా భూ వాతావరణం దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్న సందర్భాలూ లేకపోలేదు. అదీ గ్రహశకలాల కథ.
Also Read: చిరంజీవిని ఓడించేశారట్రోయ్.! ఈ శునకానందమేట్రోయ్.?
మరి, పెద్ద పెద్ద శకలాలు భూమిని తాకితే ఏమవుతుంది.? ఇంకేమవుతుంది.. డైనోసార్లు అంతమైపోయినట్లే, భూమ్మీద మనిషి సహా దాదాపు అన్ని జీవులూ అంతమైపోవచ్చు. కానీ, ఇప్పట్లో అలాంటి ప్రమాదమేమీ లేదని (Asteroid Earth) భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.