Avatar 2 Telugu Review.. ‘అవతార్’ సినిమా.. ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. మనకు తెలియని లోకంలో విహరింపజేశారు ఆ సినిమాతో.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ‘అవతార్’ సినిమా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘అవతార్’ అత్యద్భుతమైన రీతిలో వసూళ్ళ పంట పండించింది.
కోవిడ్ సహా అనేక కారణాలతో ‘అవతార్-2’ సినిమా విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ‘అవతార్-2’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.
Avatar 2 Telugu Review.. అప్పుడే ఈ నాన్సెన్స్ ఏంటి.?
‘అవతార్-2’ సినిమా విడుదలకు ముందే విపరీతమైన నెగెటివిటీని చవిచూడాల్సి వచ్చింది. సినిమా అధికారిక రిలీజ్ డేట్ డిసెంబర్ 16. కానీ, అంతకు ముందే.. ప్రీమియర్స్ టాక్ షురూ అయ్యింది.
చిత్రమేంటంటే, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడా నెగెటివిటీ కనిపించలేదు.

‘బాయ్‌కాట్’ నినాదంతో హిందీ సినిమాల్ని నాశనం చేస్తోన్న ఓ మాఫియా, ‘అవతార్-2’ మీదా అదే ప్రతాపం చూపించింది.
ఇంకా చిత్రమైన విషయమేంంటటే, మన తెలుగు మీడియాలోనూ ఓ సెక్షన్ ‘అవతార్-2’ సినిమాపై విషం చిమ్ముతూ, ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేసింది.
ఇంతకీ, సినిమాలో ఏముంది.?
సినిమాలో ఏముందో సినిమా చూస్తే కదా తెలిసేది.! కంటెంట్ లేకపోతే సినిమా ఎలాగూ ఫ్లాప్ అవుతుంది. కంటెంట్ వుంటే, ఆ సక్సెస్‌ని ఈ నెగెటివిటీ ఆపలేదు.
అరచేత్లో సూర్యకిరణాల్ని ఆపలేమని తెలిసీ, కొందరు.. తాము అపరమేధావులమన్న కోణంలో.. సినిమాల్ని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Pooja Hegde: పూజా.. సల్మాన్‌తో బ్యాండ్ బాజా.?
ఒక్కటి మాత్రం నిజం.. ఓ కొత్త ప్రపంచాన్ని ప్రపంచ సినీ ప్రేక్షకులకి పరిచయం చేసిన ‘అవతార్’ టీమ్, ఈసారి ఇంకో కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళబోతోంది. అదెలా వుంటుందో తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
అన్నట్టు, ‘పాండోరా’ అంటూ ‘అవతార్’ సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురిచేసిన జేమ్స్ కెమరూన్, ఈసారి నీటిలో అద్భుతాలు చూపించబోతున్నాడు.
‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ పేరుతో ‘అవతార్-2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.