Avatar Fire And Ash Review.. విజువల్స్ అదిరిపోయాయ్.! కానీ, అవి ఇంతకు ముందు చూసినవే కదా.? కొత్తగా ఏం చూశాం.? ఏవో కొన్ని చూశాం.. మరీ, అంత గొప్పగా ఏం లేవ్.!
ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు జేమ్స్ కెమరూన్ ‘అవతార్’ సినిమాతో.! దశాబ్దంన్నర క్రితం వచ్చిన ‘అవతార్’ అప్పట్లో ఓ సంచలనం.
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ.. అదొక సంచలనమే.! ‘అవతార్’, ప్రపంచ సినిమా గతిని మార్చేసిందని అనొచ్చా.? నిస్సందేహంగా అనొచ్చు.
తెలుగు సినిమాలు కూడా, ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాయ్. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా.. అదే తీరు.!
ఇంతకీ, ఇప్పుడొచ్చిన మూడో ‘అవతార్’ ఎలా వుంది.? ఈ ఫైర్ అండ్ యాష్ కథేంటి.? రెండో ‘అవతార్’ నిరాశపర్చిన దరిమిలా, మూడో అవతార్ కోసం జేమ్స్ కెమరూన్ ఏమైనా కొత్తగా ట్రై చేశాడా.?
Avatar Fire And Ash Review.. మళ్ళీ అదే బతుకు పోరాటం.. కాకపోతే..
ఇది కూడా బతుకు పోరాటమే.! స్కైమ్యాన్ బృందం నుంచే కాదు, తమ గ్రహమ్మీద నుంచే తమకు ఇంకో తెగ నుంచి వచ్చే ముప్పుని జేక్ సల్లీ కుటుంబం, అతని తెగ ఎదుర్కోవడమే మూడో అవతార్.!
కొన్ని విజువల్స్ కొత్తగా వున్నాయ్. చాలా విజువల్స్ పాతవే.! అదే గ్రహమ్మీద కదా పోరాటం జరిగేది.. అందుకే, రిపీట్ అనిపిస్తోందా.? అంటే, అంతేనేమో.!
కానీ, అలా వుండకూడదు కదా.! తెరపై పాత్రలు అడవుల్లో పరిగెడుతోంటే, పాత బ్యాక్‌గ్రౌండ్స్ తీసుకొచ్చి అతికించేశారా.? అని అస్సలు అనిపించకూడదు.
సినిమా ప్రారంభమైన కాస్సేపటికే బోరింగ్ అనిపిస్తుంది. మొదటి ‘అవతార్’, రెండో ‘అవతార్’ చూడకుండా, మూడో ‘అవతార్’ చూస్తే బానే అనిపిస్తుంది.
బోరింగ్.. బోరింగ్..
కానీ, మొదటి రెండూ చూశాక, మూడో ‘అవతార్’ చూస్తే మాత్రం, చాలా వరకు బోరింగ్ అనే అనిపిస్తుంది. పైగా, ఎమోషనల్ డ్రామా పెద్దగా వర్కవుట్ కాలేదు.
కొత్తదనం ఏదన్నా వుందంటే, వింత మనుషులు.. రెండు గ్రూపులు.. వాటి మధ్య గొడవ.! ఇదే కాస్త కొత్తదనం. అందులో, లేడీ క్యారెక్టర్‌కి విలనిజం ఆపాదించడం, మాయలు మంత్రాలు.. ఇవి కాస్త భిన్నంగా అనిపిస్తాయి.
దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాల నిడివి.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుందంటే అతిశయోక్తి కాదేమో.!
నిజానికి, చాలా స్కోప్ వుంది ఎమోషనల్ డ్రామా నడిపించడానికీ, లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ నడపడానికీ.! కానీ, వాటినీ సరిగ్గా పండించలేకపోయాడు జేమ్స్ కెమరూన్.
సముద్ర జీవులతో మ్యాజిక్ చేద్దామనుకున్నాడుగానీ, అదీ పెద్దగా కనెక్ట్ అవదు ఆడియన్స్‌కి.! ఎలా చూసినా, ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ పూర్తిగా నిరాశపర్చుతుంది.
అందుకే తగలబెట్టేశాడా.?
ఫైర్ అండ్ యాష్.. అని పెట్టుకున్నాడు కాబట్టి, అంతా తగలబెట్టేయాలని డిసైడ్ అయినట్లుంది పరిస్థితి. అయినా, ‘ఫైర్ అండ్ యాష్’ కంటే ముందే చనిపోయిన విలన్, మళ్ళీ ఎలా బతికొచ్చేశాడు.?
కొత్త విలన్‌ని తీసుకొచ్చి వుంటే, కాస్త ఫ్రెష్ ఫీల్ అయినా వుండి వుండేది.! ఆ పాత పగ, ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా, ఇంతకు ముందులా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా వేగం లేకపోవడం ప్రధానమైన లోపం.!
కొన్ని యాక్షన్ బ్లాక్స్ బావున్నాయనిపిస్తుంది.. అంతలోనే, అది రిపీటెడ్ కంటెంట్.. అనే భావన కలుగుతుంది.
‘ఇక్కడితో ఈ సిరీస్ ఆపెయ్.. కొత్త కాన్సెప్ట్, కొత్త ప్రపంచం ఎంచుకో..’ అని జేమ్స్ కెమరూన్‌కి అతని అభిమానులూ, ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ చూశాక సలహాలు ఇస్తున్న పరిస్థితి.
