బిగ్‌హౌస్‌లోకి ఎంటర్ అవుతూనే, తనకిచ్చిన టాస్క్‌ని బీభత్సంగా స్టార్ట్ చేసేశాడు ‘ముక్కు’ అవినాష్ అలియాస్ జబర్దస్త్ అవినాష్ (Avinash Monal Gajjar BB4). ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్లతో పోల్చితే, బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ అనదగ్గ కంటెస్టెంట్ అవినాష్ తప్ప ఇంకొకరు కన్పించరేమో.
స్వతహాగా కమెడియన్ కావడంతో, బిగ్‌బాస్‌ని అత్యద్భుతంగా వాడేసుకుంటున్నాడు అవినాష్ (Mukku Avinash). కంటెస్టెంట్స్ అందరితోనూ కామెడీ చేస్తున్నాడు.. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నాడు. ఒక్కోసారి కామెడీ ఓవర్‌డోస్ అవుతోందనే ఫీలింగ్ కొందరు కంటెస్టెంట్స్ వ్యక్తం చేస్తున్నా, అదేం లేదని వ్యూయర్స్ అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
తన డాన్సింగ్ టాలెంట్‌తోనూ, తన కామెడీ టైమింగ్‌తోనే కాదు, అవసరమైతే ‘ఆగ్రహావేశాలకు లోనుకావడంలోనూ’ ఆకట్టుకుంటున్నాడు అవినాష్ (Jabardasth Avinash). ‘కూల్..’ అంటూ అరియానా గ్లోరీతో (Ariyana Glory) నడిచిన ఓ ఫన్ అండ్ రొమాంటిక్ ట్రాక్‌కి హోస్ట్ నాగ్ నుంచి దక్కిన ప్రసంశలు సూపర్బ్. ఇక, స్వాతి దీక్షిత్‌తోనూ (Swathi Deekshit), ఇతర ఫిమేల్ కంటెస్టెంట్స్‌తోనూ పులిహోర బాగానే కలిపాడు.
తాజాగా మోనాల్ గజ్జర్‌తో (Monal Gajjar)కలిసి రాత్రి 1.30 నిమిషాల సమయంలో ఓ డ్యూయట్ వేసేసుకున్నాడు అవినాష్. ‘హ్యాపీనెస్‌తో, ఫీల్ అవుతూ పాట పాడు.. మంచి డాన్స్ చేద్దాం..’ అంటూ మోనాల్, అవినాష్‌తో కలిసి డాన్స్ చేసింది. జస్ట్ కొద్ది నిమిషాలే ఈ ఇద్దరి పెర్ఫామెన్స్ కనిపించిందిగానీ, మాంఛి కిక్ ఇచ్చింది వ్యూయర్స్‌కి.
‘అవినాష్ లేకపోతే, బిగ్‌బాస్ సీజన్ ఫోర్ (Bigg Boss Telugu 4) ఎంత డల్‌గా వుండేదో..’ అని వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారంటే, అవినాష్ ఏ స్థాయిలో ‘ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ రియాల్టీ షోకి (Bigg Boss 4 Telugu) యాడ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే, అవినాష్ చుట్టూ నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అఖిల్, సోహెల్, మెహబూబ్ తదితరులు.
దీంతో, ముందు ముందు అవినాష్‌కి బిగ్‌హౌస్‌లో సమస్యలు తప్పకపోవచ్చు. పైగా, మోనాల్ ఈ మధ్య అవినాష్‌తో కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీగా మూవ్ అవుతోంది. ‘నా మీద ఎక్కువ కామెడీలు అనవసరంగా చేయొద్దు..’ అంటూ మొదట్లో అవినాష్‌ని హెచ్చరించిన మోనల్, ఇప్పుడ అవినాష్ వెంట తిరుగుతుండడం నిజంగానే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. బిగ్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చంతే.!