Ayesha Khan Mukhachitram.. చక్కనమ్మ ఏం చేసినా అందమేనంటాడో కవి.! ఏం చేసినా, చెయ్యకున్నా కూడా అందమే.! అంతేనా.? చూపించినా, చూపించకున్నా కూడా అందమేనేమో.!
ఇదిగో, ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది కదా.! ఔను, మొహాన్ని దాచేసినా అందమే సుమీ.! ఇంతకీ, ఎవరీ అందాల భామ.!
‘ముఖచిత్రం’ (Mukha Chitram) సినిమా గుర్తుందా.? ఆ సినిమాలో నటించిందీ అందాల భామ. పేరేమో అయేషా ఖాన్.!
Ayesha Khan Mukhachitram.. ముఖచిత్రం బావుందిగానీ..
తొలి సినిమా ‘ముఖచిత్రం’ ఫర్వాలేదన్పించినా, ఆ తర్వాత ఎందుకో అయేషా ఖాన్ మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.
అందానికి అందం.. నటనలోనూ ఓకే.! అయినా, ఎందుకు ఆమెకు అవకాశాలు తెలుగులో రాలేదబ్బా.?

టాలీవుడ్‌తోపాటు పలు ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేస్తోందిట అయేషా ఖాన్.! కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించిందీ బ్యూటీ.
అందం చూడవయా.. ఆనందించవయా.!
సోషల్ మీడియాలో మాత్రం అయేషా ఖాన్ (Ayesha Khan) చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు హాట్ అండ్ వైల్డ్‌గా ఫొటోల్ని షేర్ చేస్తూ వుంటుంది.

అందుకేనేమో, అయేషా ఖాన్‌కి (Ayesha Khan) పాలోవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.! డాన్స్ అంటే ఇష్టమట ఈ బ్యూటీకి.!
Also Read: లావణ్యా.! నీకు పెళ్ళంట.! నిజమేనా.?
రెగ్యులర్‌గా డాన్స్ చేయడమే తన బ్యూటీ సీక్రెట్ అంటోంది.! అందాన్ని శరీర రంగుతో కాకుండా, మనసుతో కొలవాలంటోంది అయేషా ఖాన్ (Ayesha Khan).