Balakrishna JrNTR Nandamuri Fight.. స్వర్గీయ నందమూరి తారక రామారావుకి నిఖార్సయిన నట వారసుడు ఎవరు.? ఇందులో డౌటేముంది.? నందమూరి బాలకృష్ణే.!
హరికృష్ణ కూడా నటుడిగా రాణించినాగానీ, నందమూరి బాలకృష్ణ మాత్రమే తన తండ్రి స్వర్గీయ ఎన్టీయార్ నట వారసత్వాన్ని నిలబెట్టారు.
రాజకీయాల విషయానికొస్తే, టీడీపీ ఎమ్మెల్యేగా వున్నారు బాలకృష్ణ. హరికృష్ణ గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు.
Balakrishna JrNTR Nandamuri Fight.. జూనియర్ ఎన్టీయార్ పరిస్థితేంటి.?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీయార్ అభిమానులకీ, బాలకృష్ణ అభిమానులకీ మధ్య ‘వారసత్వ యుద్ధం’ జరుగుతోంది.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్.. ఎక్కడా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాల్లేవ్.!
కానీ, అభిమానుల మధ్య ఈ గొడవని ఆపేలా ఇద్దరూ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.!
మౌనం అర్థాంగీకారం.. అన్న కోణంలో చూస్తే, ఈ గొడవకి బాధ్యత బాలయ్య, ఎన్టీయార్ వహించాల్సి వస్తుందేమో.!
అంతిమంగా పోతున్నది ‘నందమూరి’ పరువు ప్రతిష్టలే.!
Mudra369
స్టార్‌డమ్ విషయంలో అయినా, ఇంకే విషయంలో అయినా జూనియర్ ఎన్టీయార్ కాలి గోటికి కూడా నందమూరి బాలకృష్ణ పనికిరాడంటూ ‘జూనియర్’ అభిమానులు అంటున్నారు.

అసలు నందమూరి కుటుంబంతో జూనియర్‌కి ఎలాంటి సంబంధం లేదని బాలయ్య అభిమానులు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తప్పు చేసిందెవరు.?
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకలే ఈ మొత్తం వివాదానికి కారణం.
తప్పెక్కడ జరిగిందోగానీ, హైద్రాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ (Jr NTR) రాలేదు. దాంతో, ఇప్పుడీ వారసత్వ పోరు తెరపైకొచ్చింది.
Also Read: ఇన్‌సైడ్ స్టోరీ.! మహేష్ ఎందుకు టార్గెట్ అయ్యాడు.?
తాత పేరు పెట్టుకుంటే సరిపోదు, నందమూరి వంశ ఖ్యాతిని నిలబెట్టేలా వ్యవహరించాలని కొందరు.. ఆ ఖ్యాతి నిలబెట్టే నిఖార్సయిన మగాడు ఎన్టీయార్ మాత్రమేనని ఇంకొందరు.. రచ్చ చేస్తున్నారు.
ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందోగానీ, నందమూరి (Nandamuri) అభిమానుల్లో చీలిక అయితే సుస్పష్టం.
ఓ వర్గం బాలయ్య (Nandamuri Balakrishna) తరఫున నిలబడి, జూనియర్‌ని బూతులు తిడుతోంది. ఇంకో వర్గం, జూనియర్ వెంట నిలిచి, బాలయ్యను ‘మెంటల్’ అని అభివర్ణిస్తోంది.