Balakrishna JrNTR Thokkukuntoo Povale. తొక్కుకుంటే పోవాలె.! ఇదో సినిమా డైలాగ్.! జూనియర్ నందమూరి తారక రామారావు.. అదేనండీ, గ్లోబల్ స్టార్‌గా మారిన యంగ్ టైగర్ ఎన్టీయార్ చెప్తాడీ డైలాగు.!
నందమూరి అభిమానులేమో, ఆ ‘తొక్కుకుంటూ పోవాలె’ అనే డైలాగ్ పట్టుకుని, ఇతర హీరోల్ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటుంటారు.
కానీ, బాబాయ్ నందమూరి బాలకృష్ణ (Natasimham Nandamuri Balakrishna) మాత్రం ఏకంగా అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్‌ని ‘తొక్కుకుంటూ పోవాలె’ అనుకుంటున్నట్టున్నాడు.!
ఈ తొక్కుడు గోలేంటి.?
సినిమాలోని ‘తొక్కుకుంటూ పోవాలె’ డైలాగుని సీరియస్‌గా తీసుకున్న బాలయ్య, జూనియ ర్ఎన్టీయార్ మీద దాన్ని అమలు చేస్తున్నాడా.?
బాలయ్య అభిమానులు వర్సెస్ ఎన్టీయార్ అభిమానులు.. ఎందుకీ రచ్చ.?
ఎన్టీయార్‌ని బాలయ్య అవమానిస్తున్నారా.? బాలయ్యపై ఎన్టీయార్ ప్రేమ నిజం కాదా.?
అభిమానుల రచ్చకి కారణమేంటి.? బాలయ్య ఎందుకు ఎన్టీయార్ పేరుని ప్రస్తావించలేదు.?
‘ఆర్ఆర్ఆర్’ విజయంలో ఎన్టీయార్ పాత్రని బాలయ్య గుర్తించట్లేదా.?
Mudra369
ఏదో జరుగుతోంది.. అదేంటో అర్థం కాక.. ఇరువురు నందమూరి హీరోల్నీ అమితంగా అభిమానిస్తోన్నవారు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితి కారణమెవరు.? నందమూరి బాలకృష్ణ తప్పెంత.? జూనియర్ ఎన్టీయార్ తప్పిదమెంత.? ఎవరు ఎవర్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.? ఎవరు ఎవర్ని చులకనగా చూస్తున్నారు.?
ఇదో చిత్రమైన పరిస్థితి..
తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ దక్కింది. అదీ, ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి. వేదికపై ఆస్కార్ గౌరవాన్ని సంగీత దర్శకుడు, ‘నాటు నాటు’ పాట రచయిత చంద్రబోస్ అందుకున్నారు.
ఆ వేడుకలోనే దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్.. ఇలా చిత్ర యూనిట్‌లోని పలువురు సందడి చేశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ కూడా ఈ వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. బాగానే వుంది.! రాజమౌళి పేరు ప్రస్తావించారు. అదీ మంచిదే.! కీరవాణినీ ప్రత్యేకంగా అభినందించారు. అది కూడా స్వాగతించదగ్గదే.
కానీ, జూనియర్ ఎన్టీయార్ (Man Of Masses NTR) పేరుని ప్రస్తావించలేదాయె. రామ్ చరణ్ (Global Star Ramcharan) పేరుని ఎలాగూ ప్రస్తావించడనుకోండి బాలయ్య.. అది వేరే సంగతి.!
Balakrishna JrNTR Thokkukuntoo Povale.. చిన్న ఎన్టీవోడినే తొక్కేస్తావా బాలయ్యా.?
రాజకీయ పరమైన కారణాలా.? కుటుంబ పరమైన కారణాలా.? లేదంటే, ఇంకేదైనా అక్కసు వల్లనా.? ఎందుకని, జూనియర్ ఎన్టీయార్ పేరుని బాలయ్య ప్రస్తావించలేదు.?
ఈ డౌటానుమానాలు చిన్న ఎన్టీవోడి అభిమానుల్ని ఒకింత కలవరపెడుతున్నాయి. ‘ప్రతిసారీ జూనియర్ ఎన్టీయార్‌ని బాలయ్య అవమానిస్తూనే వున్నారు..’ అని వాళ్ళంతా వాపోతున్నారు.
Also Read: ఎన్టీయార్ Vs రామ్‌చరణ్: అసలైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎవరు?
అంతేనా, బాలయ్యనీ.. అలాగే తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party) పాతాళానికి తొక్కేస్తామని చిన్న ఎన్టీవోడి అభిమానులు హెచ్చరించేస్తున్నారు.
ఆల్రెడీ తాము జూనియర్ ఎన్టీయార్‌ని (Young Tiger NTR) అదఃపాతాళానికి తొక్కేశామని బాలయ్య అభిమానులంటున్నారు.
ఏంటి బాలయ్యా.. (Nandamuri Balakrishna) ఏంటి కథ.? జూనియర్ ఎన్టీయార్‌ని (Jr NTR) తొక్కుకుంటూ పోవాలె.. అనేంతలా ‘రాజకీయం’ చేస్తున్నావా.? నిజమేనా.?