Ban Adipurush Movie.. కామెడీ కాకపోతే.. ఇప్పుడు ‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయడమేంటి.? చేయాలని నినదించడమేంటి.?
‘ఆదిపురుష్’ (Adipurush Movie) సినిమాపై మొదటి నుంచీ చాలా విమర్శలున్నాయ్.! సినిమా వచ్చింది, ‘చెత్త సినిమా’ అని కొందరు తేల్చేశారు.
కాదు, ‘ఆదిపురుష్’ (Adipurush) అద్భుతం.. అని ఇంకొందరు అంటున్నారు. సినిమా విషయంలో ఇలాంటి భిన్న వాదనలు కొత్తేమీ కాదు.
Ban Adipurush Movie ..రామాయణం కాదు.. ఆదిపురుష్.!
సినిమాని ‘రామాయణం’ అనే పబ్లిసిటీ చేశారు. ఇప్పుడేమో, రామాయణం కాదు, ఆదిపురుష్ (Adipurush) అంటున్నారు మేకర్స్.!

రావణుడి గెటప్ వికారంగా మార్చేశారు. ఇతిహాసాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుని.. నానా చండాలమూ చేశారు.!
సరే, సినిమా కోసం కమర్షియల్ హంగుల ముసుగులో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని సరిపెట్టుకోవాల్సిందే.
వసూళ్ళ ప్రభంజనం..
మేకర్స్ చెబుతున్నదాన్ని బట్టి.. మూడొందల కోట్లు అనే మైల రాయిని.. జస్ట్ మూడు రోజుల్లో దాటేసింది ‘ఆదిపురుష్’ (Adipurush).
అంటే, ఓ పది రోజుల్లో.. వెయ్యి కోట్ల రూపాయల ఫిగర్ చెప్పేస్తారన్నమాట. కానీ, చాలా చోట్ల సినిమా నష్టాలపాలైన సంగతేంటి.?
Also Read: Rakesh Master.! అదే చంపేసింది.!
సినిమా అన్నాక.. లాభ నష్టాలు మామూలే. ఈ స్థాయి నెగెటివ్ టాక్‌తోనూ ‘ఆదిపురుష్’ (Adipurush) నిలబడటమూ గొప్ప విషయమే.!
సినిమాలో ‘రామాయణాన్ని’ అడ్డగోలుగా మార్చేశారంటూ డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ‘ఆదిపురుష్’ని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఉద్యమమే నడుస్తోంది సోషల్ మీడియాలో.
సోషల్ మీడియా ఊపుళ్ళకి.. ‘ఆదిపురుష్’ టీమ్ భయపడుతుందా.? అదీ ఇప్పుడు.. అంతా అయిపోయాక.! ఛాన్సే లేదు.