బిగ్‌బాస్ రియాల్టీ షోని బ్యాన్ చేసెయ్యాలంటున్నారు (Ban Bigg Boss 2020) చాలామంది నెటిజన్లు. అసలు కథేంటి.? ఇది తెలుగు బిగ్‌బాస్ గురించి కాదు. తమిళ బిగ్‌బాస్ గురించి కూడా కాదు. ఈ ‘బ్యాన్’ అనేది హిందీ బిగ్‌బాస్ గురించి.
హిందీ బిగ్‌బాస్‌ని హోస్ట్ చేస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ మీద, ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, బిగ్‌బాస్‌ని బ్యాన్ చేసెయ్యాలంటూ ఆసక్తికరమైన డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుట్‌ని మోసం చేసిన సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందున, బిగ్‌బాస్‌ని ఎవరూ చూడొద్దంటూ సోషల్ మీడియాలో ‘బ్యాన్ బిగ్‌బాస్’ అంటూ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణానికి సంబంధించి చాలా పేర్లను ప్రస్తావిస్తూ అతని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం విదితమే.
దీపికా పడుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కరణ్ జోహార్, రియా చక్రవర్తి.. ఇలా ఎవర్నీ వదిలిపెట్టడంలేదు సుశాంత్ అభిమానులు. ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తోపాటు, అదే లైన్‌లో మరిన్ని హ్యాష్ ట్యాగ్‌లను ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో వుంచుతున్నారు.
ఇదిలా వుంటే, ‘బ్యాన్ బిగ్‌బాస్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు, చిత్రంగా హిందీ బిగ్‌బాస్‌తోపాటు, ఇతర భాషల్లో వస్తున్న బిగ్ బాస్ షోలకీ అదనపు అడ్వాంటేజ్‌గా మారింది. అవును మరి.. ఆయా రియాల్టీ షోలకు ఉచిత పబ్లిసిటీ లభిస్తోంది మరి.
ఇదిలా వుంటే, సల్మాన్‌ఖాన్ అభిమానులు, సుశాంత్ అభిమానుల ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. మరోపక్క, హిందీ బిగ్‌బాస్ మరింత గ్లామరస్‌గా ఈ సీజన్‌లో హల్‌చల్ చేసేస్తోంది. ఇక, తమిళ బిగ్‌బాస్ కూడా లేటెస్ట్‌గానే ప్రారంభమయ్యింది. తెలుగు బిగ్‌బాస్ విషయానికొస్తే, గత సీజన్ల కంటే డల్‌గా (Ban Bigg Boss 2020) సాగుతోంది.